ఒక్కోసారి అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో.. ఎవ్వరూ ఊహించలేరు. అప్పటిదాకా మన కళ్ళముందు సాదాసీదాగా కనిపించిన వ్యక్తి, రాత్రికిరాత్రే స్టార్ అయిపోవచ్చు. ఇలాంటి వారిని మనం ఇప్పటికే ఎంతోమందిని చూశాం. ఇప్పుడు తాజాగా మూలన పడి ఉన్న ఒక ఫ్లవర్ వేజ్, ఒక కుటుంబాన్ని కోటీశ్వరుల్ని చేసిన ఉదంతం యూకేలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యూకేలోని మిడ్‌ల్యాండ్స్‌లో ఉంటోన్న ఒక కుటుంబం.. 1980లలో ఒక ప్లవర్ వేజ్ జాడీని కొనుగోలు చేసింది. కొన్నాళ్ళు…
ఇతర దేశాల్లో విధించే శిక్షలతో పోలిస్తే ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల్లో విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న నేరానికే అక్కడ మరణశిక్షలు విధిస్తుంటారు. తాజాగా ఇరాక్‌లో ఓ బ్రిటీషర్ కూడా మరణశిక్షను ఎదుర్కొంటున్నాడు. అయితే అతడు చేసిన నేరం వింటే ఆశ్చర్యం కలగక మానదు. వివరాల్లోకి వెళ్తే జిమ్ ఫిట్టన్ అనే బ్రిటీషర్ ఓ రిటైర్డ్ జియాలజిస్ట్. అతడు జర్మనీకి చెందిన ఓ సైంటిస్టుతో కలిసి ఇరాక్‌లోని ఎరీదు ప్రాంతంలో…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోయి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్న వారికి రాబోయే రోజుల్లో పెద్ద షాక్ తప్పకపోవచ్చు. వచ్చే ఆరు నెలల్లో ప్రపంచాన్ని చమురు ధరలు కమ్మేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర 200 డాలర్లు దాటవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది శరాఘాతం వంటిది. వాటిని ఆర్థిక సంక్షోభంలో పడేస్తుంది. చమురు ధరల భారాన్ని మోసే శక్తి చాలా దేశాలకు లేదు. అయితే రెండు దేశాలకు మాత్రం ఆ బాధ లేదు.…
ఆఫ్ఘనిస్తాన్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా ఆ దేశం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. తాజాగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్‌లోని కుందూజ్ ఇమామ్ సాహిబ్ జిల్లాలోని ఓ ప్రార్థనా మందిరంలో శక్తివంతమైన బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా.. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ బాంబు దాడి వెనుక ఐఎస్ఎస్ పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం భారత్, అమెరికా సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? ఇరు దేశాల మధ్య స్నేహం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందా? ఇప్పుడు ఈ రెండు అంశాల మీద అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమణకు పాల్పడ్డ రష్యా చర్యను భారత్ ఖండించకుండా తటస్థ వైకరి తీసుకోవటం అమెరికా సహా పలు పశ్చిమ దేశాలకు మింగుడుపడటం లేదు. ఎలాగైనా భారత్ మనసు మర్చాలని చూస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవల అమెరికా, దాని మిత్ర దేశాల విదేశాంగ…
ఎవరెస్ట్ శిఖరంపై విషాద ఘటన చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన ఓ పర్వతారోహకుడు ఎవరెస్ట్ శిఖరంపైనే ప్రాణాలు కోల్పోయాడు. 38 ఏళ్ల ఎంజిమి టెన్జీ షెర్పా అనే పర్వతారోహకుడు గతంలో అనేకసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అయితే తాజాగా మరోసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కే క్రమంలో చదునుగా ఉండే ప్రాంతంలో కూర్చున్న అతడు విగతజీవుడై కనిపించాడు. ఎంజిమి షెర్పా ఎవరెస్ట్‌పైనే మరణించడం పలువురు పర్వతారోహకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే షెర్పా ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని తెలుస్తోంది. అతడు ఎత్తయిన…
అమెరికాకు చెందిన స్పేస్ X సంస్థ అంతరిక్ష యాత్రలో మరో ఘనత సాధించింది. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోకి స్పేస్ X సంస్థ నలుగురు వ్యోమగాములను పంపింది. వీరు 10రోజుల పాటు ఆ కేంద్రంలో గడపనున్నారు. ఐఎస్ఎస్‌కు పయనమైన మొట్టమొదటి ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్ ఇదే. దిగువ భూ కక్ష్యలో వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రల రంగంలో ఇదో మైలురాయి అని నాసా అభివర్ణించింది. అయితే స్పేస్ X సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు చెందినది…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. దీంతో ఐపీఎల్ ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. ప్రసార హక్కుదారులకు చెల్లించేందుకు డబ్బుల్లేక అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే యుప్ టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయలాగ్ టీవీ, పియో టీవీ ఛానల్లు క్యాష్ రిచ్ లీగ్ ప్రసారాలను నిలిపివేశాయి. దేశంలో ఎమర్జెన్సీ నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసే మూడ్‌లో లేరని.. అందుకే ఐపీఎల్ టెలికాస్ట్‌పై అంతగా ఫోకస్ పెట్టలేదని అక్కడి మీడియా వెల్లడించింది. ఐపీఎల్లో శ్రీలంక ఆటగాళ్లు…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి తాజాగా రాజకీయ సంక్షోభం తోడైంది. ప్రజాగ్రహం నేపథ్యంలో ఆదివారం క్యాబినెట్ మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల్లో ప్రధాన మంత్రి కొడుకు నమల్ రాజపక్స కూడా ఉన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరతకు తన రాజీనామా తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ప్రధాని మహింద్రా రాజపక్స మాత్రం రాజీనామా చేయలేదు. మరోవైపు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు గవర్నర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మహింద్రా రాజపక్సతో పాటు…
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జాతీయ అసెంబ్లీలో ఆదివారం విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ తిరస్కరించారు. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీని కాపాడుకున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ఇమ్రాన్ ఖాన్ సిఫారసు పంపించారు. మరోవైపు తన సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని సభలో తిరస్కరించిన వెంటనే జాతిని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు.…