USA SHOOTING INCIDENT: మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇటీవల కాలంలో తుపాకీ కాల్పుల ఘటనల్లో అమాయకులు మరణిస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. శనివారం తెల్లవారుజామున సీటెల్ శివారు రెంటల్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. కాల్పుల ఘటన తెలుకున్న పోలీసులు అక్కడి వెళ్లగానే.. అప్పటికే ఒకరు మరణించారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఓ వివాదం కారణంగా కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒకరి కన్నా ఎక్కువ మంది కాల్పులకు తెగబడి ఉండవచ్చని పోలీసులు అంచానా వేస్తున్నారు.
అమెరికాలో గన్ వయలెన్స్ ఆర్కైవ్ ప్రకారం.. 2022లో ఇప్పటి వరకు తుపాకీ కాల్పుల ఘటనలు జరిగాయి. గత నెలలో ఉవాల్డే, బఫెలో, టెక్సాస్ లో కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మే నెలలో జరిగిన టెక్సాస్ స్కూల్ షూటింగ్ ఘటనలో 21 మంది మరణించారు. ఇందులో 19 మంది చిన్నారులే ఉండటం అమెరికాతో పాటు ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనల తరువాత అమెరికాలో గన్స్ ను నిషేధించాలనే వాదన బలంగా వచ్చింది. తుపాకులు కొనుగోలు చేసే వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
Read Also: Russia- Ukraine War: ఒప్పందం జరిగిన రోజు వ్యవధిలోనే రష్యా దాడి..
ఇటీవల అమెరికాలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే జూన్ 20న వాషింగ్టన్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మరణించారు. అంతకు ముందే జూన్ 1న ఓక్లహామాలోని తుల్సా నగరంలో హాస్పిటల్ క్యాంపస్ లో జరిగిన కాల్పు ఘటనలో నలుగురు మరణించారు. వీటన్నింటి కన్నా టెక్సాస్ ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన ఘటన దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో 19 మంది చిన్నారులు చనిపోయారు. 2018 లో మార్జోరీ స్టోన్ మ్యాన్ డగ్లస్ హైస్కూల్ లో ఇలాగే కాల్పులు జరిగాయి.. ఆ సమయంలో 17 మంది మరణించారు.