America: అమెరికాను వణికిస్తున్న రాకాసి నత్తలు.. ఫ్లోరిడాలో లాక్‌డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యం అమెరికాను నత్తలు వణికిస్తున్నాయి. అయితే అవి సాధారణ నత్తలు కావు. వ్యాధులను సక్రమింపచేసే నత్తలు. ఆఫ్రికా వాటి పుట్టినిల్లు. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ జాతి నత్తలు సైజులో చాలా పెద్దగా ఉంటాయి. వాటి సైజు 8 అంగుళాలు ఉంటుంది. పెద్దవాళ్లు పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత సైజులో నత్త ఉంటుంది. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. అయితే ఓడల్లో సరుకుల ద్వారానో లేదా మనుషుల ద్వారానో అమెరికాకు చేరాయి. ఈ జాతికి చెందిన ఒక్కో నత్త ఏడాదికి 1,200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది. ఈ 1200 నత్తలు ఒక్కొక్కటి 1,200 పిల్లలను కంటాయి. అంటే ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలు పుడతాయి. ఈ నత్తలు ఉన్న చోట ఎటువంటి పంట అయినా దెబ్బతినటం ఖాయం.
Read Also: Digital News: చట్టపరిధిలోకి డిజిటల్ న్యూస్.. పార్లమెంట్ ముందుకు రానున్న కొత్త చట్టం!
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ఆఫ్రికన్ జెయింట్ నత్తలపై ఉండే సూక్ష్మజీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సంక్రమిస్తే మనుషుల్లో జ్వరం, తలనొప్పి, మెదడుకు నీరుపట్టడం, కండరాల బలహీనత, ఫిట్స్, కాంతిని చూస్తే తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి నత్తలు ఇప్పుడు ఫ్లోరిడా రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ నత్తలు తిరుగుతున్న విషయాన్ని ఫ్లోరిడా వ్యవసాయ, వినియోగదారుల సేవా విభాగం (FDACS) నిర్ధారించింది. ఈ నత్తలు ఏయే వస్తువులపై తిరిగాయో వాటిని ఇప్పుడు ప్రజలు ముట్టుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని న్యూ పోర్ట్ రిచీ పట్టణంలో లాక్‌డౌన్ విధించారు. ఈ లాక్‌డౌన్ ప్రకారం ప్రజలు తమ ఇళ్ల దగ్గర ఉండే మొక్కలు, మట్టి, చెత్త, కంపోస్ట్ వంటి వాటిని కదపకూడదు. నిర్మాణ వస్తువుల్ని కూడా అలాగే ఉంచాలి. వీటి సంగతిని పర్యావరణ రక్షణ ఏజెన్సీ చూసుకుంటుంది. ఈ నత్తల వల్ల మనుషులకే కాకుండా పర్యావరణానికీ హానే. ఈ నత్తలకు చెట్లు, కాంక్రీట్ అంటే ఇష్టం. దీంతో ఇవి పర్యావరణానికి ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ ఇళ్లలోకి వచ్చిన నత్తలను బయట పడేయాలనుకుంటే ప్రొటెక్టివ్ గేర్ లాంటిది చేతులకు తొడుక్కోవాలని అధికారులు సూచిస్తున్నాకాగా రు. ఇలాంటి నత్తల్ని పంపిణీ చేయడం, విక్రయించడం, నౌకల్లో తరలించడం అమెరికాలో చట్ట విరుద్ధం.
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!