భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దానికి కారణం.. హ్యాండ్‌షేక్. ఎందుకంటే టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సల్మాన్ అలీ అఘాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా.. శివం దుబేతో కలిసి కెప్టెన్ సూర్య పాకిస్థాన్ జట్టును పట్టించుకోలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 'హ్యాండ్ షేక్ వివాదం' అంశాన్ని ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ముందు లేవనెత్తింది.
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దాయాది పాకిస్థాన్‌తో ఆసియా కప్ 2025లో భారత్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ ఇండియన్ ఫాన్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే ఐసీసీ, ఏసీసీ నిబంధనల ప్రకారం పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడక తప్పలేదు. మ్యాచ్ విజయంను పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మ్యాచ్ సాయంలో, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పాక్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకుండా ఉండడంపై ఫాన్స్ హర్షం…
ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇండియన్ ఫాన్స్ డిమాండ్ చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో, మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్…
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దాయాది పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని భారత అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆసియా కప్ 2025లో భాగంగా నవంబర్ 14న దుబాయ్ వేదికగా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్ 2025’, ‘బాయ్‌కాట్ భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్’ అని ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనలకు లోబడి మ్యాచ్ ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసింది. బాయ్‌కాట్ ట్రెండ్ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌కు…
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే.. హోరాహోరీ పోరు, ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. దుబాయ్ స్టేడియంలో పాక్ అభిమానుల సందడి కాసేపు కనిపించినా.. ఆ తర్వాత అది కూడా కనిపించకుండా పోయింది. పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కారణంగా ఫాన్స్ నిరాశలో కనిపించారు. భారత్ చేతిలో ఓటమి అనంతరం…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట ఓ బిగ్ మిస్టేక్ చోటుచేసుకుంది. క్రికెట్ ఆటలో మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల ఆటగాళ్లు.. తమ తమ జాతీయ గీతాలు ఆలపించడం ఆనవాయితీ. ఇండో-పాక్ మ్యాచ్‌లో ముందుగా పాకిస్థాన్ జాతీయ గీతం మొదలు కావాల్సి ఉంది. అయితే డీజే ఆపరేటర్ పొరపాటుగా పంజాబీ-ఇంగ్లిష్ పాప్ సాంగ్ ‘జలేబీ బేబీ’ని ప్లే చేశాడు. దాంతో పాక్…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ముందుగా బ్యాటింగ్‌లో 127 పరుగులే చేసిన పాక్.. ఆపై బౌలింగ్‌లో కూడా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఘోర వైఫల్యం ఆ జట్టుపై ప్రభావం చూపింది. ప్రపంచంలో బెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన అఫ్రిది.. 16 ఓవర్లలో రెండు ఓవర్లే బౌలింగ్ చేయడం విశేషం. ఆ రెండు ఓవర్లలో ఏకంగా…
భారత్ చేతిలో దాయాది పాకిస్థాన్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 25 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో…
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిల్ కూడా దాఖలైంది. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. కేంద్రం కూడా వద్దని చెప్పలేదు. మరోవైపు ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకే పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతున్నట్లు బీసీసీఐ కూడా తెలిపింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఉగ్రవాద దాడి బాధితు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నా అని తెలిపాడు. బాధిత కుటుంబాలకు భారత జట్టు తరఫున సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నాడు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు సూర్య ధన్యవాదాలు తెలిపాడు. భారతదేశానికి ఈ విజయం ఒక అద్భుతమైన రిటర్న్…