MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Razr Fold Launch: బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 (MWC 2026) వేదికగా మోటోరోలా (Motorola) నుండి సరికొత్త బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘మోటోరోలా రేజర్ ఫోల్డ్’ (Motorola Razr Fold)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లతో పాటు ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన FIFA వరల్డ్ కప్ 26 కలెక్షన్ ఎడిషన్‌ను కూడా ప్రకటించింది.
సన్నని డిజైన్ & 2K డిస్‌ప్లే:
మోటోరోలా రేజర్ ఫోల్డ్ అత్యంత సన్నని డిజైన్‌తో లాంచ్ అయ్యింది. ఇది తెరిచినప్పుడు కేవలం 4.6mm, మడతపెట్టినప్పుడు 9.9mm మందం మాత్రమే ఉంటుంది. ఇందులో 6.6 అంగుళాల బాహ్య డిస్‌ప్లే, 8.1 అంగుళాల 2K LTPO అంతర్గత డిస్‌ప్లే ఉన్నాయి. స్టెయిన్ లెస్ స్టీల్ టియర్ డ్రాప్ హింజ్ & టైటానియం ప్లేట్ వినియోగం వల్ల స్క్రీన్ మడత తక్కువగా కనిపిస్తుంది. వీటితోపాటు.. ‘కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 3’ రక్షణతో వచ్చిన తొలి ఫోన్‌గా ఇది నిలుస్తుంది.
Also Read
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!
2026 FIFA World Cup ప్రత్యేక ఎడిషన్:
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026ను పురస్కరించుకుని రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ డిజైన్ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఫుట్‌బాల్ ఆకృతిలో కనిపించే రైజ్డ్-డాట్ ప్యాటర్న్ ఉండటం వల్ల ఇది మంచి గ్రిప్ లభిస్తుంది. ఫోన్ మధ్యలో 24 క్యారెట్ల బంగారు పూతతో అధికారిక FIFA వరల్డ్ కప్ 2026 లోగోను అమర్చడం ద్వారా ఇది ప్రీమియం & కలెక్టర్ ఎడిషన్ లుక్‌ను అందిస్తోంది.
ఫ్లాగ్‌షిప్ కెమెరా సెటప్:
ఈ ఫోన్ క్వాల్కమ్ సంబంధించిన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 16GB ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లతో హై-ఎండ్ యూజర్ల అవసరాలను తీర్చగలదు. కెమెరా విభాగంలో 50MP ప్రధాన కెమెరా (Sony LYTIA 828 సెన్సార్), 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (100x సూపర్ జూమ్), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం లోపల 32MP, బయట 20MP కెమెరాలు అందించారు.

బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్:
ఇందులో 6,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీను అమర్చారు. ఇది 80W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కేవలం 12 నిమిషాల్లోనే 12 గంటల బ్యాటరీ లైఫ్ అందుతుందని కంపెనీ తెలిపింది. అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ముఖ్యంగా 7 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని మోటోరోలా హామీ ఇచ్చింది.
మోటో పెన్ అల్ట్రా:
ఈ ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు ‘మోటో పెన్ అల్ట్రా’ (Moto Pen Ultra) అనే స్మార్ట్ స్టైలస్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. డాక్యుమెంట్స్‌పై మార్కప్ చేయడం, నోట్స్ తీసుకోవడం, డిజిటల్ ఇలస్ట్రేషన్స్ గీయడం వంటి పనులకు ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. దీనికి ప్రత్యేక ఛార్జింగ్ కేస్ కూడా అందుబాటులో ఉంటుంది.
ధర:
యూరప్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర 1,999 యూరోలు (సుమారు రూ. 2,14,735)గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో మోటో పెన్ అల్ట్రా కూడా లభిస్తుంది. రాబోయే నెలల్లో ఆసియా పసిఫిక్ (భారత్ సహా), ఉత్తర అమెరికా, ఇతర మార్కెట్లలో ఇది అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!