భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున ఎగబడతారు. దాయాదులు బరిలోకి దిగినప్పుడు ఏ స్టేడియం అయినా నిండిపోతుంది. ఈ క్రమంలోనే ఇండో-పాక్ మ్యాచ్ టిక్కెట్లకు ఉండే క్రేజ్ మరో లెవల్లో ఉంటుంది. టికెట్స్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి కాస్త బిన్నమైనా.. చివరకు భారీ ప్రైజ్ టికెట్స్ కూడా మొత్తం అమ్ముడుపోయాయి. రూ.4 లక్షల టికెట్స్ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. ఆసియా కప్ 2025లో…
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. భారత్ తొలి మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయాన్ని సాధించింది. ఇక సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియాసిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టును వీడాడు. ఆసియా కప్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న సుందర్.. టోర్నమెంట్ మధ్యలోనే జట్టును వీడి ఇంగ్లండ్‌కు బయలుదేరారు. ఇంగ్లండ్ ప్రసిద్ధ కౌంటీ జట్టు హాంప్‌షైర్‌లో అతడు చేరాడు. 2025 ఛాంపియన్‌షిప్‌లో చివరి రెండు మ్యాచ్‌లు సుందర్ ఆడనున్నాడు.…
ఆసియా కప్ 2025ఓ భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను ఉత్సాహపరిచేందుకు అభిమానులు పెద్దగా స్టేడియంకు రాకపోయినా.. ఒకరు మాత్రం మైదానంలో సందడి చేశారు. భారత జెండా పట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియాను ఉత్సాహపరుస్తూ కెమెరాల్లో కనిపించారు. దాంతో క్రికెట్ అభిమానులలో చర్చనీయాంశంగా మారారు. ఆమె అఫ్గానిస్థాన్‌కు చెందిన వజ్మా ఆయుబి. 28 ఏళ్ల వజ్మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా. 2022 ఆసియా…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నా.. గతంలో పాకిస్తాన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూఏఈలో టోర్నీ జరగుతోంది. బుధవారం పసికూన యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ రికార్డు విజయం సాధించి.. టోర్నీని ఘనంగా ఆరంభించింది. తర్వాతి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను భారత్ ఢీ కొట్టనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14 (ఆదివారం) జరగనుంది. పాకిస్థాన్‌పై విన్నింగ్ కాంబినేషన్‌తోనే దాదాపుగా భారత్…
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ గత ఆరు నెలలుగా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ప్రతి టీమిండియా స్క్వాడ్‌లోనూ ఉంటున్నా.. తుది జట్టులో మాత్రం అవకాశం రావడం లేదు. 2025 ఆరంభంలో ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికయ్యాడు. ఐదు టీ20ల్లో ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు కానీ.. రెండు వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడిన కుల్దీప్.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. ఇంగ్లీష్ గడ్డపై అతడు ఒక్క టెస్ట్…
ఆసియా కప్ 2025 ని భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రికార్డ్ విజయంను అందుకుంది. టీమిండియా తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఆదివారం దుబాయ్ స్టేడియంలో జరగనుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజెన్స్, పలువురు ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.…
ఆసియా కప్ 2025లో భారత్ తన ప్రయాణంను నేడు మొదలెట్టనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈని టీమిండియా ఢీకొట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా.. భారత్ మాదిరి పటిష్టంగా లేవు. నేడు యూఏఈపై భారత్ భారీ విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఆసియా…
ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, యూఏఈ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 12న ఒమన్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఇక సెప్టెంబర్ 14న హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ ఖాన్ షిన్వారీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో 12 ఏళ్ల అతడి కెరీర్ ముగిసింది. తాజాగా ఆసిఫ్ అలీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.…
Asia Cup 2025: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 రేపటి (సెప్టెంబర్ 9) నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఆసియాలోని 8 జట్లు పొట్టి ఫార్మాట్లో (T20I) తలపడనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో జరగనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు కొనసాగే ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశ, సూపర్ 4…