Sahibzada Farhan: ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా ఆదివారం నాడు భారత్ తో జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ ఫర్హాన్ తన హాఫ్ సెంచరీ తర్వాత చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. భారత అభిమానులను రెచ్చగొట్టేలా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా అతని ప్రవర్తన ఉందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. Haris Rauf: ఛీ.. ఛీ..…
Haris Rauf: ప్రస్తుతం క్రికెట్లో భారత్‌తో పోటీపడి గెలవడం పాకిస్థాన్‌కు రోజురోజుకు కష్టమవుతోంది. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన కూడా మైదానంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే, ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో భారత్‌పై గెలిచేందుకు తన జట్టుకు అవసరమైన వికెట్లు తీయలేకపోయిన పాకిస్థాన్ పేసర్ ‘హారిస్ రవూఫ్’ బౌండరీ లైన్ వద్ద అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు. రవూఫ్ ‘విమానం కూలిపోతున్నట్లు’ చేసిన సైగలు భారతీయ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో…
Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా టోర్నమెంట్లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు…
Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఉత్తమంగా ఏమి చేయగలమో దానిపై దృష్టి పెడుతున్నాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో మేము అనుసరిస్తున్న మంచి అలవాట్లన్నింటినీ పాటించాలని…
ఆసియా కప్ 2025లో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమిని ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత కరచాలనం వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీపై ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం పీసీబీ ఫిర్యాదును పక్కనపెట్టింది. సూపర్-4లో ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. చిరకాల…
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు పడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన భారత్.. మరోసారి జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఒకవేళ అనివార్య కారణాల చేత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దుబాయ్‌లో…
ఆసియా కప్ 2025లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరోసారి కీలక పోరుకు సిద్దమైంది. సూపర్-4 దశలో దాయాది పాకిస్థాన్‌తో ఈరోజు రాత్రి 8 గంటలకు టీమిండియా తలపడనుంది. గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన సూర్య సేన.. మరోసారి అదే ఫలితం పునరావృతం చేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాక్ ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అనే చెప్పాలి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం కొందరు భారత్ ప్లేయర్స్…
ఆసియా కప్ 2025లో సూపర్-4 మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించింది. నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో ఇప్పటికే పాకిస్థాన్‌ను సునాయాసంగా ఓడించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. లీగ్ మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్…
ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లలో ఆధిపత్యం చలాయించిన భారత్.. నేడు కూడా ఫెవరేట్‌గా బరిలోకి దిగనుంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్ సూపర్-4లో టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై…
Asia Cup 2025: ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్లో సూపర్-4 దశకు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు స్థానం సంపాదించగా.. తాజాగా గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా అర్హత సాధించాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. గ్రూప్-B చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్-4లోకి ప్రవేశించింది. ఒకవేళ…