40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?
- Moto Buds 2 & Moto Buds 2+ గ్లోబల్ మార్కెట్లో విడుదల..
- డాల్బీ హెడ్ ట్రాకింగ్ సపోర్ట్..
- 40 గంటల బ్యాటరీ లైఫ్, ANC సపోర్ట్
- IP54 రేటింగ్, ట్రిపుల్ మైక్ సిస్టమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto Buds 2 Series: స్మార్ట్‌ఫోన్ విభాగంలో దూసుకుపోతున్న మోటోరోలా (Motorola) ఆడియో సెగ్మెంట్‌లో కూడా తనదైన మార్క్ ను సృష్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే మోటో బడ్స్ 2 (Moto Buds 2), మోటో బడ్స్ 2+ (Moto Buds 2+) అనే నెక్స్ట్ జనరేషన్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్రముఖ ఆడియో బ్రాండ్ బోస్ (Bose) భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ఇయర్ బడ్స్ ప్రీమియం సౌండ్ అనుభవాన్ని అందించేలా డిజైన్ చేశారు.
ప్రీమియం ఆడియో:
Moto Buds 2+ ఈ సిరీస్‌లో హై-ఎండ్ మోడల్‌గా నిలుస్తోంది. ఇందులో ‘Sound by Bose’ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల స్పష్టమైన వాయిస్ క్లారిటీతో పాటు లోతైన బేస్ ఫీల్ కావచ్చు. డైనమిక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ ఉండటం వల్ల బయటి శబ్దాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. కేసింగ్‌తో కలిపి దాదాపు 40 గంటల వరకు ప్లేబ్యాక్ సమయం లభిస్తుంది. అంతేకాదు దీనికి వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ‘డాల్బీ హెడ్ ట్రాకింగ్’ టెక్నాలజీ సపోర్ట్‌తో.. తల తిప్పినప్పుడు ఆడియో దిశ కూడా మారి థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ హిస్టరీ.. అప్పర్ హ్యాండ్ ఎవరిదో తెలుసా?
మరోవైపు తక్కువ ధరలో మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే వినియోగదారుల కోసం Moto Buds 2ను రూపొందించారు. ఇవి తేలికగా ఉండి చెవుల్లో సౌకర్యవంతంగా అమరేలా డిజైన్ చేశారు. పాన్టోన్ కలర్ వేరియంట్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. 11mm డైనమిక్ డ్రైవర్లు హై-రెజల్యూషన్ ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. IP54 రేటింగ్ ఉండటంతో చెమట, తేలికపాటి వర్షం నుంచి రక్షణ లభిస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్‌తో వేగవంతమైన, స్థిరమైన కనెక్టివిటీని అందిస్తుంది.
మెరుగైన కాల్ క్వాలిటీ:
ఈ రెండు ఇయర్‌బడ్స్ ను ‘మోటో బడ్స్ యాప్’ (Moto Buds App) ద్వారా నియంత్రించవచ్చు. యూజర్లు ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ను తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ట్రిపుల్ మైక్ సిస్టమ్ సపోర్ట్ వల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు గాలి శబ్దం తగ్గి స్పష్టమైన వాయిస్ అనుభవం లభిస్తుంది.
క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!
ధర:
Moto Buds 2+ ధర 149 యూరోలు (రూ. 13,500)గా నిర్ణయించారు. Moto Buds 2 ధర సుమారు 79 యూరోలు (రూ. 7,100)గా ఉంది. ఈ ఇయర్‌బడ్‌లు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా మార్కెట్లలో త్వరలో విక్రయానికి రానున్నాయి. భారత మార్కెట్లో కూడా వీటి లాంచ్‌పై త్వరలో స్పష్టత రానుంది.
Every detail deserves to be heard in clarity.
Introducing moto buds 2 and moto buds 2 plus: Pure sound, zero distractions.
Read more: https://t.co/W7Fiq29M8X pic.twitter.com/AIuJnvn42o— motorola (@Moto) March 2, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!