Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
- ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్
- కోహ్లీ మూడో స్థానంలో వచ్చి ఆదుకునేవాడు
- ఓపెనింగ్ విభాగంలో భారత్ వెనకబడే ఉంది
- సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Bold Comments on Opener Rohit Sharma: భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లలో రోహిత్ భాయ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి పవర్‌ప్లేలో ఇబ్బంది పడ్డాడన్నాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో వచ్చి పరుగుల వరద పారించే వాడని.. అందుకే టీమిండియా ఓపెనర్ల బలహీనత పెద్దగా బయటపడలేదని చెప్పాడు. గత 10–12 సంవత్సరాలుగా టీ20 ప్రపంచ కప్‌లలో భారత్ బాగా ఆడుతున్నప్పటికీ.. ఓపెనింగ్ విభాగంలో ఇతర జట్లతో పోలిస్తే కొంత వెనుకబడి ఉండేదని సంజు అభిప్రాయపడ్డాడు.
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డూ ఆర్ డై మ్యాచ్, భారీ లక్ష ఛేదన.. అందులోనూ వరుసగా వికెట్స్ పడుతున్నా సంజు బెదరలేదు. సహచరులతో చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మిస్తూ.. జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. భారత్ స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్, హార్దిక్ పాండ్యలు క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నా.. పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. సంజు మాత్రం ఒక్క అవకాశం ఇవ్వకుండా.. చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా ఓపెనింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
- IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
- Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
‘గత 10–12 సంవత్సరాలుగా భారత్ ఎప్పుడూ టీ20 ప్రపంచ కప్‌లలో బాగా ఆడుతోంది. కానీ ఓపెనింగ్ విషయంలో మాత్రం ఇతర జట్లతో పోలిస్తే భారత్ స్థిరమైన ప్రదర్శన చేయలేదు. విరాట్ భయ్యా 3వ స్థానంలో వచ్చి పరుగులు చేసేవాడు. కాబట్టి టీమిండియా ఓపెనర్ల బలహీనత పెద్దగా బయటపడలేదు. టీ20 ప్రపంచ కప్‌లలో రోహిత్ భాయ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి పవర్‌ప్లేలో ఇబ్బంది పడ్డాడు. దాంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పడేది. రోహిత్ ఓపెనర్‌గా చేయలేనిది నేను చేయాలనుకున్నా. నన్ను నేను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నా. టీ20 ప్రపంచ కప్ ఛేదనలో రోహిత్ భాయ్ తన కెరీర్‌లోనే ఒక్క మేటి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు’ అని సంజు శాంసన్ వివరించాడు.
రోహిత్ శర్మ టీ20 వరల్డ్‌కప్‌లలో ఛేజ్ చేస్తూ మ్యాచ్ గెలిపించిన సందర్భాలు చాలా అరుదు అని సంజు శాంసన్ అన్నాడు. తాను జట్టుకు ఆ దిశగా ఉపయోగపడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. తన ప్రదర్శనతో జట్టుకు బలమైన ఆరంభం అందించడమే ప్రధాన ఉద్దేశమని సంజు చెప్పుకొచ్చాడు. సంజు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు అభిమానులకు ఇది విశ్లేషణగా కనిపిస్తుండగా.. మరికొందరు మాత్రం వివాదాస్పదంగా భావిస్తున్నారు. ఏదేమైనా ఒంటిచేత్తో వెస్టిండీస్‌పై మ్యాచ్ గెలిచింపిన సంజుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం