దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదయం 4 గంటలకు పోలీసులకు-వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియా మధ్య కాల్పులు జరిగాయి. మొదట నేరస్థుడు కాల్పులు జరపగా.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు.
UP: ఉత్తర్ ప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇఫ్తికార్ ఖాన్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఖాన్ గురించి నిర్దిష్ట సమాచారం తెలిసిన తర్వాత పోలీసులు తెల్లవారుజామున 5.30-6.00 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కాస్‌గంజ్ కు చెందిన ఇఫ్తికార్ ఖాన్ పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించబడ్డాడు. ఇతడిపై రూ. లక్ష రివార్డు ఉంది. Read Also: Bihar Elections: పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు..…
దేశంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటి వరకు అనేక మంది ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
ఆ ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులు. 26 మందిని చంపిన నరహంతకులు. యుద్ధంలో ఆరితేరిన వారు. అధునాతన ఆయుధాలు ప్రయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు. అలాంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం మామూలు విషయం కాదు. ఎంతో ప్రణాళిక ఉండాలి.
పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ముష్కరులు హతమయ్యారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు కుక్కచావు చచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సైన్యం అధికారికంగా ధృవీకరించినట్లు ఆలిండియా రేడియో వైబ్‌సైట్‌లో పేర్కొంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎంకౌంటర్ జరిగింది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని దేవిపట్నం మండలం కించకూరు-కాకవాడి గండి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. Also Read: Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్!…
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భీకర ఎన్‌కౌంటర్‌తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.
పరేషన్ కాగార్ పేరుతో కర్రె గుట్టలను చుట్టుముట్టి అక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి నష్ట్రాన్ని చేకూర్చింది భద్రతా బలగాలు. అది పూర్తైన తర్వాత అబుజుమడుని తమ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు, ఇంద్రవతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి.
Maoist's Letter: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని అందులో పేర్కొన్నారు. నంబాల గత 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని చెప్పారు.
జమ్మూకాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో రెండో రోజు ఉగ్రవాదులపై కాల్పులు కొనసాగుతున్నాయి. చత్రోలోని సింగ్పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందాడు.