అభయారణ్యంలో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే…!
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశంగా చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా గతేడాది నుంచి దేశ వ్యాప్తంగా భద్రతా దళాలు మావోయిస్టులను ఏరివేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు లొంగిపోయారు. మిగతా వారి కోసం జల్లెడ పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Saudi-UAE War: పశ్చిమాసియాలో మరో ఉద్రిక్తత.. రెండు గల్ఫ్ దేశాల మధ్య తీవ్ర పోరు
ఈ క్రమంలో శనివారం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. సుక్మా జిల్లాలోని కొంటా కిస్తారామ్ అడవుల్లో మావోయిస్టులతో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు హతం అయ్యారు. కొంటా ఏరియా కమిటీకి చెందిన సచిన్ మగ్దూ హతమయ్యాడు. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. AK47, INSAS వంటి ఆటోమేటిక్ ఆయుధాలను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతంసుక్మా DRG సిబ్బంది సంఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు.