Maoist’s Letter: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని అందులో పేర్కొన్నారు. నంబాల గత 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని చెప్పారు. కేశవరావు టీమ్ లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవల పోలీసులకు లొంగిపోయారు.. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఈ దారుణం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు ఒకరు సైతం ద్రోహిగా మారాడని ఆ లేఖలో మావోయిస్టులు రాసుకొచ్చారు.
Read Also: BJP: ‘‘ఆమె ఐఏఎస్ అధికారినా లేక పాకిస్తానీనా.?’’ వివాదంగా బీజేపీ నేత కామెంట్స్..
ఇక, ఎన్ కౌంటర్ కు ముందురోజు నుంచి 20 వేల మంది బలగాలు తామున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి.. 10 గంటల్లో ఐదుసార్లు కాల్పులకు దిగింది అని మావోయిస్టులు లేఖలో తెలిపారు. 60 గంటల పాటు భద్రతా బలగాలు తమను నిర్బంధించాయి.. అప్పటికే నంబాల కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చాలా ప్రయత్నించగా.. తమను వదిలి వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదని వెల్లడించారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని తమతోనే ఉన్న కేశవరావు కోసం 35 మంది ప్రాణాలు అడ్డుపెడితే.. ఏడుగురం సురక్షితంగా బయట పడ్డాం.. మిగిలిన వారందరూ ఎన్ కౌంటర్లో చనిపోయారని ఆ లేఖలో ప్రస్తావించారు.
Read Also: Bihar: సీఎం విచిత్ర ప్రవర్తన.. పూల బొకేను ఆఫీసర్ నెత్తినపెట్టిన నితీష్‌కుమార్
అయితే, ఇప్పటికే తాము కాల్పుల విరమణ ప్రకటించినట్లు చెప్పారు.. దేశ సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ చేసుకున్న కేంద్ర ప్రభుత్వం.. మాతో శాంతి చర్చలు జరిపేందుకు రెడీగా లేకపోవడం గమనార్హం అని లేఖలో రాసుకొచ్చారు. ఈ విషయంపై మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం పునరాలోచించాలని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.