Anti-Maoist Operation: దేశంలో పీడిత జనాల కోసం పోరాటం చేసిన పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. అది మామూలు కష్టం కూడా కాదు.. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి లేకుండా పోయింది. ఆపరేషన్ కాగారు పేరుతో కొనసాగుతున్న కూంబింగ్ లో మావోయిస్టు అగ్రనేతలను భద్రత బలగాలు హతమార్చుతున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ నంబాల కేశవరావు ఎన్ కౌంటర్లో చనిపోయిన తర్వాత అంతే స్థాయిలో ఉన్న సుధాకర్ ని సైతం హతమార్చాయి. 16 నెలల్లో 11 మంది కేంద్ర కమిటీ సభ్యులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. 44 మందితో ఉండాల్సిన కేంద్ర కమిటీ ఇప్పుడు కేవలం 11 మందికే పరిమితమైంది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే 9 మంది ఉన్నారు.
Read Also: Konda Vishweshwar Reddy: చేవెళ్లకు చుక్క నీరు రాదు.. మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..
అయితే, ఆపరేషన్ కాగార్ పేరుతో కర్రె గుట్టలను చుట్టుముట్టి అక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి నష్ట్రాన్ని చేకూర్చింది భద్రతా బలగాలు. అది పూర్తైన తర్వాత అబుజుమడుని తమ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు, ఇంద్రవతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే 3 రోజులుగా ఆపరేషన్ నేషనల్ పార్క్ పేరుతో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. 3 రోజుల్లో 7 మావోయిస్టులను చంపేశాయి భద్రతా సిబ్బంది. అందులో కేంద్ర కమిటీ సభ్యుల్లో కీలకమైన సుధాకర్ తో పాటు భాస్కర్ కూడా చనిపోయాడు. మావోయిస్టు పాఠశాలకు అధిపతిగా ఉంటూ వ్యూహాలు ఎత్తుగడలు వేయడంలో కీలక పాత్ర పోషించిన సుధాకర్ మరణించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో కీలక పాత్ర పోషించి చర్చల కోసం బయటికి వచ్చి తిరిగి లోపలికి వెళ్లిన సుధాకర్ ను బలగాలు ఎన్ కౌంటర్ లో హతమార్చాయి.
Read Also: SVSN Varma : పవన్ కల్యాణ్ చెప్పినా మారరా.. ఇసుక మాఫియాపై వర్మ కామెంట్స్..
కాగా, ఇప్పుడు మరొ 10 మంది కూడా భద్రతా బలగాల చేతుల్లో ఉన్నారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన వాళ్ళని వదిలి పెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బలగాల చెరలో ఉన్న 10 మందిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని కోరుతున్నాయి. అది సాధ్యం కాకపోతే తాము సుప్రీంకోర్టులో హైబీఎస్ కార్పస్ పిటిషన్ వేస్తామని పేర్కొన్నాయి. ఛత్తీస్ గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్ట్ నాయకులు బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు, రామన్న డీసీ మెంబర్, మున్నా, సునీత, మహేష్ లకు పోలీసులు ప్రాణ హాని తలపెట్టకుండా వెంటనే న్యాయస్థానం ముందు హాజరు పర్చాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తుంది.
Read Also: Kingdom: అనుకున్నంతా అయ్యింది!
ఇక, ప్రాణాలతో దొరికిన మావోయిస్టు నాయకులను ఎన్ కౌంటర్ పేరుతో హతమార్చడం రాజ్యాంగ విరుద్ధం అని పౌర హక్కుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. మావోయిస్ట్ పార్టీ ప్రకటించినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు సుధాకర్, భాస్కర్లను మాత్రమే గుర్తించాం.. ఇంకా ఐదుగురిని గుర్తించ వలసి ఉందని పేర్కొంది.. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలను గుర్తించ వలసి ఉందని భద్రతా బలగాలు ప్రకటించాయి.