దేశంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటి వరకు అనేక మంది ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మళ్లీ పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు.. మిడ్-టర్మ్ పరీక్షలు రద్దు
ఉధంపూర్, కిష్త్వార్‌లో భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఏడుగురు ఉగ్రవాదులు సైన్యానికి చిక్కినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక జవానుకు కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో సైన్యం రంగంలోకి దిగడంతో సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారో సైన్యం ఇంకా ప్రకటించలేదు. ఉధంపూర్‌లో చిక్కిన ఉగ్రవాదులు జైషే ఏ మహమ్మద్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక