Chhattisgarh: బీజాపూర్ భీకర ఎన్‌కౌంటర్.. అడెల్లుతో సహా కీలక ఏడుగురు మావోయిస్టులు మృతి..
- కాల్పులతో దద్దరిల్లుతున్న ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్..
- మైలారపు ఆడెల్లుతో సహా ఏడుగురు మావోయిస్టులు మృతి..
- మరో 10 మంది మావోలు భద్రతా బలగాల అదుపులో ఉన్నట్లు ప్రజాసంఘాల ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ భీకర ఎన్‌కౌంటర్‌తో దద్దరిల్లుతోంది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ శనివారం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక మావోయిస్టులను హతమైనట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటి సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియస్ భాస్కర్ ఉన్నారు.
జూన్ 05,06, 07న బీజాపూర్ అడవుల్లో యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూన్ 05న 025న, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) సుధాకర్ @ గౌతమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 06న తెలంగాణ రాష్ట్ర కమిటీ (TSC) సభ్యుడు భాస్కర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతి రోజుల్లో మిగతా మావోయిస్టుల మృతదేహాలను లభ్యమయ్యాయి.
Also Read
గౌతమ్, భాస్కర్‌తో పాటు గుర్తు తెలియని ఇద్దరు మహిళా మావోయిస్టులు, గుర్తుతెలియని ముగ్గురు పురుష మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న ఐదు గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహాల గుర్తింపును నిర్ధారించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఎన్‌కౌంటర్ ప్రదేశాల నుండి రెండు AK-47 రైఫిల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, దండకారణ్యంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, పాము కాట్లు, తేనెటీగల దాడులు, డీహైడ్రేషన్ వల్ల కొందరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిందరికి ప్రస్తుతం వైద్య సాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, మరోవైపు ప్రజాసంఘాలు ఎన్‌కౌంటర్లపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. మరో 10 మంది మావోయిస్టుల భద్రతా బలగాల అదుపులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!