Delhi Encounter: ఢిల్లీలో మరో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో నిందితుడు
- ఢిల్లీలో మరో ఎన్‌కౌంటర్
- పోలీసుల అదుపులో నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. మెహ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదయం 4 గంటలకు పోలీసులకు-వాంటెడ్ క్రిమినల్ కోకు పహాడియా మధ్య కాల్పులు జరిగాయి. మొదట నేరస్థుడు కాల్పులు జరపగా.. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. నేరస్థుడు జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ రవీంద్రకు గాయాలు కాగా.. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ధరించిన మరో ఇద్దరు పోలీసులకు ప్రమాదం తప్పింది. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ఎదురుకాల్పుల్లో పహాడియాకు గాయాలు కావడంతో చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో పహాడియా వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: US: హోవార్డ్ యూనివర్సిటీ దగ్గర కాల్పులు.. నలుగురు మృతి!
ఇటీవల రోహిణి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. సిగ్మా గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ సహా నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. ఈ నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లుగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసుల సంయుక్తంగా జరిపిన దాడిలో ఈ నలుగురు గ్యాంగ్‌స్టర్లు చనిపోయారు. అక్టోబర్ 22-23 మధ్య రాత్రి 2:20 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నలుగురు బీహార్‌లో అనేకమైన తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. సిగ్మా అండ్ కంపెనీగా ఈ గ్యాంగ్ పిలువబడుతుంది. ఈ ముఠాకు రంజన్ పాఠక్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నలుగురు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ కుట్రకు ప్రణాళిక రచించినట్లుగా పోలీసులు గుర్తించారు. కుట్ర ఛేదించే క్రమంలో పోలీస్ బృందాలు గాలిస్తుండగా గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు తెగబడడంతో పోలీసులు నలుగురిని హతమార్చారు.
#WATCH | A brief exchange of fire took place between Delhi Police and wanted criminal Koku Pahadia in the Mehrauli area, injuring the accused. During the encounter, two police personnel were hit on their bulletproof jackets, while one constable sustained an injury on his arm.… pic.twitter.com/bHvb37zZHt
— ANI (@ANI) October 25, 2025
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!