పుల్వామాలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతం అయ్యారు. పుల్వామాలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కాసమాచారంతో ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ కలిసి జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ చేస్తుండగా పాక్ కు చెందిన లష్కర్ ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. సైన్యం ఎదురుకాల్పులు జరిపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం పుల్వామాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూను విధించారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ జవాన్లు…
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు గ్రామస్తులు మృతిచెందడం ఛత్తీస్‌గడ్‌లో కలకలం సృష్టిస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీజాపూర్ జిల్లా సిల్గర్ గ్రామంలో పోలీసు బెటాలియన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 3 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు గ్రామస్తులు.. తమ గ్రామంలో పోలీసు బెటాలియన్ ఏర్పాటు చేయొద్దని నిరసనకు దిగారు.. అయితే.. నిరసన కాస్త ఉద్రిక్తంగా మారిపోయింది… పోలీసులతో గ్రామస్తులు ఘర్షణకు దిగినట్టుగా తెలుస్తుండగా… ప్రతిఘటించడానికి కాల్పులకు దిగారు పోలీసులు.. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్తులు అక్కడిక్కడే మృతిచెందారు.. దీంతో.. గ్రామంలో ఉద్రిక్త…