Encounter: జమ్మూ కాశ్మీర్ కథువాలో ఉగ్రవాదుల చొరబాటును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు! ఈ ప్రాంతంలో ఇద్దరు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు…
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు-మావోల మధ్య ఎదురుగాల్పులు జరుగుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక మావోల శిబిరాన్ని డీఆర్‌జీ సైనికులు ధ్వంసం చేశారు.
దేశంలో నక్సలిజాన్ని రూపుమాపేందుకు.. మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలు పలువురు మావోలను మట్టుబెట్టారు. తాజాగా మరో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిపారు. Also Read:CM…
UP Encounter: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరడుకట్టిన నేరస్తుడు హతమయ్యాడు. పోలీస్ ఆపరేషన్‌లో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చనిపోయిన నిందితుడిని జీతుగా గుర్తించారు. ఇతడిపై రూ. 1 లక్ష రివార్డు ఉంది. బుధవారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్)తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించాడు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా జీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వారి ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. దేశంలో…
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అయినా గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఓ వైపు భద్రతా సిబ్బంది దాడులు చేస్తున్నా... మావోలు మాత్రం కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
కేంద్రం సహకారంతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు. రాజమండ్రిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.…
Encounter: జమ్మూ కాశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. బారాముల్లా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. బారాముల్లాలోని సోపోర్ సెక్టార్లో భద్రతా దళాలు కార్డర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.