Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అంగీకరించారు. ‘‘భారతదేశం రష్యాకు అతిపెద్ద కస్టమర్. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల నేను 50 శాతం సుంకం విధించాను. అది చేయడం తేలికైన విషయం కాదు.’’ అని ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు, మేక్ అమెరికా గ్రేట్ అగెన్(MAGA) క్యాంపెన్‌ను నిర్వహించిన రిపబ్లికన్ మద్దతుదారు చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా చార్లీ కిర్క్‌కు పేరుంది.
HIRE Act: సుంకాలతో భారత్‌ను ఇబ్బంది పెడుతున్న ట్రంప్ సర్కార్ మరో కొత్త చట్టానికి పదును పెడుతోంది. భారత ఐటీ రంగాన్ని ఈ చట్టం టార్గెట్ చేస్తుంది. దీంతో, అమెరికాలోనే క్లయింట్లకు సేవల్ని అందిస్తున్న భారతీయ ఐటీ సంస్థలు, ఉద్యోగులు తీవ్ర ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒహియోకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ బెర్నీ మోరెనో ప్రవేశపెట్టిన హాల్టింగ్ ఇంటర్నేషనల్ రిలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ (HIRE) చట్టం, ఆమోదం పొందితే అమెరికన్ కంపెనీలు విదేశీ కార్మికులనున నియమించుకునే…
USA: రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితేనే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం ముందుకు సాగుతుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. భారత్‌తో వాణిజ్యం, రష్యన్ ఆయిత్ దిగుమతులు ఆపివేయడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ట్రంప్ 50 శాతం సుంకాలతో ఇరు దేశాల ఉద్రిక్తతల మధ్య లుట్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Charlie Kirk: హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు, మద్దతుదారు చార్లీ కిర్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అత్యున్నత పౌరపురస్కారమైన ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉటా యూనివర్సిటీలో కిర్క్‌ను ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు. క్యాంపస్‌లోని సోరెన్సెన్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించిన డిబేట్ సమయంలో హత్యకు గురయ్యారు. మరణానంతరం ట్రంప్ కిర్క్‌కి ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Trump tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్‌తో ప్రపంచదేశాలు విసిగిపోయాయి. ప్రపంచంలోనే పలు ప్రధాన దేశాలపై ఆయన సుంకాలు విధించారు. అన్ని దేశాల కన్నా ఎక్కువగా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. దీనికి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తున్నారనే సాకు చెబుతున్నారు.
Israel Strikes Qatar: అరబ్ దేశాల్లో అమెరికాకు అత్యంత మిత్రదేశంగా ఖతార్ ఉంటుంది. అలాంటి ఖతార్‌పై మంగళవారం ఇజ్రాయిల్ దాడులు చేసింది. రాజధాని దోహాలో ఉన్న హమాస్ పొలిటికల్ బ్యూర్ నేతలే టార్గెట్‌గా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అయితే, ఇదంతా అమెరికాకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. కానీ, ఇజ్రాయిల్ దాడి చేసే విషయాన్ని, అమెరికా ఖతార్‌కు ఆలస్యంగా తెలియజేసిందని తెలుస్తోంది. ఈ దాడికి అమెరికా అధ్యక్షుడు
గాజాలో బందీలను విడుదల చేసే ఒప్పందానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం హమాస్‌కు ‘తుది హెచ్చరిక’ జారీ చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో “ఇజ్రాయెల్ నా షరతులను అంగీకరించింది. ఇప్పుడు హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది” అని రాసుకొచ్చారు. ‘ షరతులను అంగీకరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నేను హమాస్‌ను హెచ్చరించాను. ఇది నా చివరి హెచ్చరిక, ఇక మరో అవకాశం ఉండదు!’…