Jason Miller: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, తాజా భారత లాబీయిస్ట్ జాసన్ మిల్లర్ రంగంలోకి దిగారు. ఆయన ట్రంప్, ఆయన అడ్మినిస్ట్రేషన్‌లోని కీలక వ్యక్తులను కలిశారు.
Mallikarjun Kharge: అమెరికా సుంకాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రధాని మోడీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ స్నేహితులు కావచ్చు, కానీ మోడీ దేశానికి శత్రువు అయ్యారని ఆరోపించారు. కర్ణాటక కలబురిగిలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ, ట్రంప్ ఒకరి కోసం ఒకరు ఓట్లు కోరినందున వారు మంచి ఫ్రెండ్స్ గా ఉండవచ్చని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గతంలో కోర్టు విధించిన 515 మిలియన్ డాలర్ల జరిమానాను పునదుద్దరించాలని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ కోరారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాపార లావాదేవీలతో మోసం జరిగిందన్నారు న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్. ఈ విషయంపై కోర్టుకు వెళితే.. ఆయనకు 515 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని వాదనలు వినిపించినప్పటికి.. చాలా ఎక్కువని.. ఆ జరిమానాను కోర్టు కొట్టివేసిందన్నారు జేమ్స్. ఈ…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గించారు. జపాన్ వాహనాలు, ఇతర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం జూలైలో కుదిరిన ఒప్పందం అమలులో భాగం. అమెరికా, జపాన్ మధ్య నెలల తరబడి జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం జపాన్ ఆటో పరిశ్రమకు ఉపశమనం కలిగించడమే కాకుండా, అమెరికాలో జపాన్ $550 బిలియన్ల పెట్టుబడికి మార్గం సుగమం…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానురీతిలో పలు దేశాలపై సుంకాలు విధించడాన్ని ఇటీవల అమెరకన్ ఫెడరల్ అప్పీల్ కోర్టు తప్పు పట్టింది. అయితే, ఈ తీర్పును ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతోంది. కోర్టులో పిటిషన్ వేసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఈ సుంకాలను ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌ని లింక్ చేసింది. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి కోసం మా ప్రయత్నంలో కీలకమైన అంశం’’ అని సుంకాలను సమర్థిస్తూ వాదించింది.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా, ట్రంప్ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలకు మద్దతుగా నిలిచారు. ఈ రెండు దేశాలను యూఎస్ ఆంక్షల పేరుతో బెదిరించలేదని అన్నారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ అనంతరం మీడియాతో మాట్లాడిన పుతిన్..
అమెరికాపై భారతదేశమే భారీగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది చాలా సంవత్సరాలుగా ఈ సంబంధం ఏకపక్షంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
India-US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన జాన్ మెయర్‌షీమర్, ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్ పరిపాలన భారత విధానాన్ని ‘‘భారీ తప్పు’’గా అభివర్ణించారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై సెకండరీ టారిఫ్స్ పనిచేయవని అన్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా…
తగలబడుతున్న రష్యా.. చమురు శుద్ధి ఫ్యాక్టరీలే ఉక్రెయిన్ టార్గెట్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ఒకవైపు ముమ్మరంగా ప్రయత్నాలు జరుతుంటే.. మరోవైపు ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటునే ఉన్నాయి. మాస్కో-కీవ్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుండి కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వివాదం తీవ్రమైంది. ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలాస్కాలో యుద్ధాన్ని ముగించడానికి సమావేశమయ్యారు. తర్వాత…