గత కొద్దిరోజులుగా ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Trump Tariffs: ఇరాన్ ప్రజాతిరుగుబాటు నేపథ్యంలో, ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ టాప్-5 వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఉంది.
Trump: ప్రజా ఉద్యమంతో ఇరాన్ అట్టుడుకుతోంది. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని ప్రావిన్సుల్లో ప్రజాందోళన ఎగిసిపడుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా పోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. తనకు తానుగా వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Trump: వెనిజులా దేశంపై దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడి నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేసింది. అతడిపై నార్కో-టెర్రరిజం కేసుల్ని మోపింది. ఈ నేపథ్యంలో మరో దేశానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో వెంటనే ఒప్పందం చేసుకోవాలని మరో లాటిన్ అమెరికన్ దేశం క్యూబాను హెచ్చరించారు. లేకపోతే క్యూబాకు ఇకపై చమురు, ఆర్థిక సాయం ఉండదని హెచ్చరించారు. ‘‘క్యూబాకు ఇకపై చమురు, డబ్బులు ఉండవు. ఇంకా ఆలస్యం చేయకుండా అమెరికాతో వారు ఒప్పందం…
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత విలేకర్ల సమావేశంలో ట్రంప్ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. మదురో మాదిరిగా పుతిన్‌ను కూడా భవిష్యత్‌లో కిడ్నాప్ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా ఉన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారో లేదో వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై కన్నుపడింది.
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడకపోవడమే అని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ.. ‘‘ఇవి సరైనవి కావు’’ అని చెప్పింది.
Greenland issue: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను డెన్మార్క్ దేశానికి చెందిన ద్వీపమైన ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై పడింది. తమ జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్ కావాల్సిందే అని ట్రంప్ చెబుతున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే, అమెరికా దుందుడుకు చర్యలపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నాయి. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో డెన్మార్క్ సభ్యదేశంగా ఉంది. సభ్యదేశంగా ఉన్న డెన్మార్క్‌పై దాడి చేస్తే ఇది నాటో భవితవ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తుందని యూరప్…
Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికాపై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ‘‘ఇంధన దురాశ’’తో వ్యవహరిస్తున్నారని అన్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో పాలుపంచుకుంటున్నారని, డ్రగ్స్ ముఠాలకు నేతృత్వం వహిస్తున్నారని వెనిజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను అమెరికా దాడి చేసి నిర్బంధించిన తర్వాత, రోడ్రిగ్జ్ మాట్లాడుతూ..