H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా వార్షిక రుసుమును భారీగా పెంచాడు. ఈ చర్యల ముఖ్యంగా భారతీయుల టెక్కీలు, ఇతర రంగాల్లో అమెరికాలో పనిచేస్తున్న వారికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. H-1B visa వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. ప్రస్తుత వీసా హోల్డర్లతో సహా H-1B ఉద్యోగులు, వారి యజమాని ఉద్యోగికి USD 100,000 వార్షిక రుసుము (రూ. 88 లక్షలకు పైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము చెల్లించకపోతే ఆదివారం…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల నియమాలను మార్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1-B వీసాల దరఖాస్తు రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై సంతకం చేశారు. ఈ చర్య అమెరికాలోని వర్క్ వీసాలపై భారతీయ కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. H1-B దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడానికి కంపెనీలు చెల్లించే రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. Also Read:Cyber Fraud : వృద్ధుడి ఆధార్ కార్డు మానవ…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, లండన్ తొలి ముస్లి్ం మేయర్ సాదిక్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ట్రంప్, సాదిక్ ఖాన్ ‘‘ప్రపంచంలోనే చెత్త మేయర్లలో ఒకరు’’ అని విమర్శించారు. యూకే రాజధానిలో నేరాలు, వలసల్ని అరికట్టడంతో ఆయన విఫలమయ్యారని అన్నారు. తన గౌరవార్థం యూకే ప్రభుత్వం ఇస్తున్న విందుకు అతడిని ఆహ్వానించవద్దని తానను వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు.
Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మోలానియో బుధవారం, గురువారం లండన్‌లో పర్యటించనున్నారు. బుధవారం విండ్సర్ కోటలో కింగ్ చార్లెస్-3, క్వీన్ కెమెల్లా ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇక గురువారం ప్రధాని కీర్ స్టార్మర్తో ట్రంప్ భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఇద్దరు నాయకులు భారతదేశం-అమెరికా సంబంధాలు, ప్రపంచ సమస్యల గురించి కూడా చర్చించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే కోరికను అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తం చేశారు. ఈ చర్యను భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేయడానికి,…
Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే దోహదపడ్డానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు ప్రకటించుకున్నారు. తాను వాణిజ్యంతో భయపెట్టడం వల్లే రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ప్రగల్భాలు పలికారు. అయితే, ఈ వాదనల్ని భారత్ మొదటి నుంచి ఖండిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ సాక్షాత్తుగా పార్లమెంట్లో కాల్పుల విరమణలో ఏ దేశ జోక్యం లేదని స్పష్టం చేశారు.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా సెప్టెంబర్ 25న ఇద్దరు పాక్ నాయకులు ట్రంప్‌తో చర్చలు జరుపుతారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ప్రధాన వాణిజ్య ఒప్పంద సంధానకర్త బ్రెండన్ లించ్ మంగళవారం భారత ప్రతినిధులతో భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై పూర్తి రోజు చర్చలు జరపనున్నారు. భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన తర్వాత ప్రభావితమైన వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది. Also Read:Hyderabad : రాయదుర్గం భూముల వేలానికి సర్కార్ రెడీ భారతదేశం -అమెరికా వాణిజ్య సంబంధాలపై ట్రంప్ చేసిన సానుకూల…
CHINA: రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చైనాపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను కోరారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని ఆయన ఓ లేఖలో కోరారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని లేఖలో కోరారు. అన్ని నాటో దేశాలు అంగీకరించి సుంకాలు వేయడానికి సద్ధంగా ఉన్నప్పుడు, తాను రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.