Epstein Files: అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘‘ఎప్‌స్టీన్’’ ఫైల్స్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. డెమొక్రాట్లు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని, ఇప్పుడు అన్ని నిజాలు బయటపడుతాయని ట్రంప్ అన్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు 427 మంది అనుకూలంగా, ఒక్కరు వ్యతిరేకంగా ఓటేశారు.
Read Also: Nitish Kumar: నేడు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం.. కొలువుదీరనున్న ఎన్డీయే సర్కార్..
ప్రతిపక్షాలు, ప్రజల నుంచి ఈ ఫైళ్లను విడుదల చేయాలనే ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్, కమ్యూనికేషన్స్, అలాగే 2019లో జైలులో ఆయన మరణంపై దర్యాప్తు గురించిన సమాచారాన్ని 30 రోజుల్లో విడుదల చేయాలని బిల్లు కోరుతోంది. బాధితుల వ్యక్తిగత సమాచారం, కొనసాగుతున్న దర్యాప్తుకు హాని చేసే వివరాలను దాచి పెట్టవచ్చు. రాజకీయ ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయనే నెపంతో సమాచారాన్ని దాచిపెట్టరాదని బిల్లు చెబుతోంది.
ఏమిటి ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్:
ఈ కేసులో జెఫ్రీ ఎప్‌స్టీన్ అతని భాగస్వామి ఘిస్లైన్ మాక్స్‌వెల్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2002-2005 మధ్య జరిగిన ఈ సెక్స్ కుంభకోణంలో అనేక మంది యువతులకు డబ్బును ఎరగా వేసి జెఫ్రీ లైంగిక దాడులు చేయడమే కాకుండా, అనేక మంది అమెరికా పెద్దమనుషులకు అమ్మాయిలను సఫ్లై చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితులో ఒకరైన వర్జీనియా గియుఫ్రే 2015లో సివిల్ దావా వేయడంతో ఈ పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫైళ్లలో అమెరికా రాజకీయ నాయకుల నుంచి పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఎప్‌స్టీన్ తన సెక్స్ ట్రాఫికింగ్ వ్యాపారాన్ని నిర్వహించడంలో అతనికి అనేక మంది సహకరించినట్లు ఈ ఫైల్స్ పేర్కొంది. ఎలా ఎప్‌స్టిన్, మాక్స్ వెల్ యుక్తవయసులోని బాలికలకు ఎలా ఈ అక్రమ రవాణా వ్యాపారంలోకి ఆకర్షించారనే వివరాలను కొత్త బిల్లులో బయటకు వచ్చే అవకాశం ఉంది. జులై 2019లో ఎప్స్టీన్‌పై సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాలు మోపారు, అయితే అతను విచారణకు రాకముందే మాన్‌హాటన్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో మాక్స్‌వెల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.