Donald Trump: ‘‘నీకు ఎంత మంది భార్యలు’’.. దేశాధ్యక్షుడిని అడిగిన ట్రంప్..
- ‘‘నీకు ఎంత మంది భార్యలు’’..
- సిరియా అధ్యక్షుడిని అడిగిన ట్రంప్..
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా వైట్ హౌజ్‌లో భేటీ అయ్యారు. ఒకప్పుడు ఉగ్రవాదిగా ముద్ర పడిన అల్ షరా ఇప్పుడు సిరియా దేశాధినేత. ఆయనపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు అల్ షరా, ట్రంప్‌లు పక్కపక్కన నిలబడి చర్చించుకున్నారు. 1946లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత తొలిసారిగా ఒక సిరియా అధ్యక్షుడు వైట్ హౌజ్ అధికార పర్యటనకు వెళ్లారు. సిరియాపై ఆంక్షల ఉపశమనాన్ని అమెరికా మరో 180 రోజుల పాటు పొడిగించిన ఈ సందర్శన జరిగింది.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
అయితే, ఇప్పుడు ట్రంప్, అల్ షరాల మధ్య జరిగిన చిన్న వీడియో వైరల్ అవుతోంది. ట్రంప్ ఆల్ షరాకు ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ ను అందిస్తూ, దానిని అతడిపై స్ప్రే చేస్తూ, ‘‘ఇది మంచి సువాసన కలిగి ఉందని, మరొకటి మీ భార్య కోసం’’ అని అన్నారు. సరదాగా ‘‘ఎంత మంది భార్యలు.?’’ అని ప్రశ్నిస్తారు. దీనికి అల్ షరా స్పందిస్తూ ‘‘ఒక్కరే’’ అని బదులిస్తారు. ట్రంప్ దీనికి స్పందిస్తూ ‘‘మీకు ఎప్పటికీ తెలియదు’’ అని సరదాగా అంటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పర్యటనలో అల్ షరా ట్రంప్‌కు పురాతన సిరియన్ కళాఖండాల ప్రతిరూపాలను బహుకరించారు. వీటిలో చరిత్రలోనే మొదటి ఆల్ఫాబెట్, చరిత్రలో మొదటి స్టాంప్ వంటికి ఇచ్చినట్లు చెప్పారు. అల్ షరా గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మనందరికి కఠినమైన గతాలు ఉన్నాయి. కానీ అతడికి కఠినమైన గతం ఉంది. నేను నిజాయితీగా చెప్పాలంటే, మీకు కఠినమైన గతం లేకపోతే, మీకు అవకాశం ఉండదు’’ అని అన్నారు. డిసెంబర్ 8న, ఇస్లామిస్ట్ దళాలు చేసిన మెరుపు దాడిలో సిరియాలో బషర్ అల్ అసద్ పాలన అంతమైంది. 43 ఏళ్ల అల్ షరా అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.
‘How many wives? One?’ Trump asks Syria’s new leader in White House — video
Trump gifted Al-Shaar perfume and went on to SPRAY him with it
‘This is the best fragrance! And the other one is for your wife’
Al-Sharaa assured Trump he only has one wife. Vibe check passed, too pic.twitter.com/SAjO6Vc8GH
— RT (@RT_com) November 12, 2025
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!