Donald Trump: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై భారీ దాడులు నిర్వహించింది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు దిగడంతో పాక్ వైమానిక దళానికి చెందిన 10 ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. అయితే, ఈ ఆపరేషన్ తర్వాత నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తానే యుద్ధాన్ని ఆపినట్లు పలు సందర్భాల్లో ప్రకటించారు. వాణిజ్యాన్ని చూపించి యుద్ధాన్ని నివారించినట్లు చెప్పుకున్నారు. ఈ సంఘర్షణలో కొన్ని విమానాలు కూలినట్లు చెప్పాడు. ట్రంప్ వాదనల్ని భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. కాల్పుల విరమణలో ఏ దేశ ప్రమేయం లేదని స్పష్టం చేసింది.
Read Also: Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోడీ..
అయితే, ట్రంప్ మరోసారి ఇదే విధంగా నోరు పారేసుకున్నాడు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించడానికి 350 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించానని, సమస్యను పరిష్కరించానని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ తనకు ఫోన్ చేసి ‘‘మేము యుద్ధానికి వెళ్లబోవడం లేదు’’ అని చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నాడు. కాల్పుల విరమణను పాకిస్తాన్ కోరిందని, ఇందులో మూడో పక్షం జోక్యం లేదని భారత్ స్పష్టం చేసినప్పటికీ, ట్రంప్ ఇదే విషయాన్ని ఇప్పటి వరకు 60 సార్లు రిపీట్ చేశారు.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హాజరైన US-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మాట్లాడుతూ.. ‘‘భారత్, పాకిస్తాన్‌లు యుద్ధాన్ని కొనసాగిస్తే ప్రతీ దేశంపై 350 శాతం సుంకాలు విధిస్తానని చెప్పాను. రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం ఉండదని హెచ్చరించానున. దీంతో మేము అలా చేయబోం అని రెండు దేశాలు చెప్పాయి. ’’అని అన్నారు. తనలా ఏ అమెరికా అధ్యక్షుడు చేయలేదని, 8 యుద్ధాలను నిలిపేశానని అన్నారు.