అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జన్‌పింగ్ మధ్య సోమవారం ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఇద్దరి మధ్య కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఇద్దరి మధ్య రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావనకు రావడం విశేషం.
ఇది కూడా చదవండి: Mumbai airport: ప్రపంచ రికార్డ్ సృష్టించిన ముంబై ఎయిర్‌పోర్ట్.. దేంట్లో అంటే..!
వాణిజ్య యుద్ధం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇద్దరి మధ్య ముఖాముఖి భేటీ జరగలేదు. దీంతో ఇటీవలే తొలిసారి దక్షిణకొరియాలో ఇద్దరు అధ్యక్షులు కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం చైనాపై 10 శాతం టారిఫ్ తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: PM Modi: నేడు అయోధ్యలో కాషాయ జెండా ఆవిష్కరించనున్న మోడీ.. విశిష్టతలు ఇవే!
ఇక తాజా ఫోన్ కాల్ సంభాషణలో కూడా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు బీజింగ్‌కు రావాల్సిందిగా ట్రంప్‌ను జిన్‌పింగ్ ఆహ్వానించారు. దీంతో జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఏప్రిల్‌లో బీజింగ్ వస్తానని ట్రంప్ తెలియజేశారు. అలాగే వాషింగ్టన్ రావాల్సిందిగా జిన్‌పింగ్‌ను ట్రంప్ ఆహ్వానించారు. ఈ మేరకు చైనా విదేశాంగ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణకొరియాలో సాధించిన సానుకూల సంబంధాలు ఇరు దేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. ఇక చర్చల వివరాలు బయటకు చెప్పకపోయినా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కీలక ఫోన్ కాల్ సంభాషణ జరిగిందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఏప్రిల్‌లో ట్రంప్ బీజింగ్ సందర్శిస్తారని తెలిపింది.
ఇక ఇద్దరి మధ్య తైవాన్ అంశం, ఉక్రెయిన్ యుద్ధం గురించి, ఫెంటానిల్ అక్రమ రవాణ, రైతులకు సంబంధించిన ఒప్పందాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ సంభాషణ తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. చైనాతో మా సంబంధం చాలా బలంగా ఉందని.. రైతుల కోసం కీలక ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ఏప్రిల్‌లో చైనాను సందర్శిస్తానని.. అలాగే ఏడాది చివరిలో జిన్‌పింగ్ అమెరికా సందర్శిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇక తైవాన్‌పై చైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని నూతనంగా ఎన్నికైన జపాన్ ప్రధాని సనే తకైచి హెచ్చరించారు. తైవాన్‌పై దాడి జరిగితే టోక్యో సైనిక జోక్యం ఉంటుందని తెలిపారు. జపాన్ ప్రధాని ప్రకటనపై బీజింగ్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తైవాన్ తమ సొంతం అని చైనా వాదిస్తుండగా.. లేదు.. లేదు తైవాన్ తమదంటూ జపాన్ వాదిస్తోంది. తైవాన్‌ను అమెరికా సార్వభౌమ రాజ్యంగా అధికారికంగా గుర్తించింది.