Nikki Haley: అమెరికా మాజీ రాయబారి, భారతీయ మూలాలున్న రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆదివారం భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలైన ఆమె, భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్న విషయంలో హెచ్చరిస్తూ.. వీలైనంత త్వరగా వైట్ హౌస్‌తో చర్చలు జరపాలని సూచించారు. దశాబ్దాలుగా ఉన్న స్నేహం, నమ్మకంతో ఇలాంటి ఉద్రిక్తతలను అధిగమించవచ్చు. కానీ, రష్యా చమురు సమస్యను సీరియస్‌గా తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. CM Revath Reddy: త్వరలోనే…
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లోని డోనెత్స్క్ ప్రాంతంలోని రెండు గ్రామాలను తమ సైన్యం స్వాధీనం చేసుకుంది. సిరెడ్నె, క్లెబన్ బైక్ గ్రామాలు ఇప్పుడు రష్యా నియంత్రణలోకి వెళ్లాయని ప్రకటించింది. అంతేకాకుండా రష్యా సైన్యం ఉక్రెయిన్ సైనిక సముదాయంపై దాడులు జరిపినట్టు తెలిపింది. 143 ప్రాంతాల్లో ఉక్రెయిన్ సాయుధ దళాలు, విదేశీ…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కొత్తగా ఓ అల్టిమేటం జారీ చేశారు. ఆయన తెలిపిన ప్రకారం రెండు వారాల్లో శాంతి చర్చలు ప్రారంభం కావాలని లేదంటే వేరే మార్గాన్ని అనుసరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓ ఇంటర్వ్యూలో శాంతి ఒప్పందం సాధ్యాసాధ్యాల గురించి ప్రశ్నించగా, ట్రంప్ “రెండు వారాల్లోనే స్పష్టత వస్తుంది, లేదంటే వేరే దారిని ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ఇలా చేయడం తొలిసారి కాదు. ఇదివరకు కూడా ఇలాంటి…
వైట్‌హౌస్ వేదికగా ట్రంప్-జెలెన్స్కీ సమావేశం ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగినట్లు వాతావరణం కనిపిస్తోంది. గత ఫిబ్రవరిలో ట్రంప్-జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం చాలా హాట్‌హాట్‌గా సాగింది.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం 2022 లో ప్రారంభమైంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. అయితే, ఎవరూ విజయవంతం కాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇంతలో, రేపు, అంటే ఆగస్టు 15 న, అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే సమావేశం ఈ యుద్ధం పరంగా కీలకంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో ఇద్దరు నాయకులు…
ప్రధాని మోడీ దేశ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించడాన్ని రూబిన్ తీవ్రంగా తప్పుపట్టారు. మోడీ నిర్ణయం.. అమెరికాకు నిజమైన గుణపాఠం నేర్పుతుందని తెలిపారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీ లోని నిరాశ్రయులు “నగరాన్ని విడిచి వెళ్లాలి” అంటూ, నగరంలో నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. అయితే దేశ రాజధానిని బగ్దాద్తో పోల్చేలా వైట్‌హౌస్ చేసిన వ్యాఖ్యలకు వాషింగ్టన్ డీసీ మేయర్ మురియెల్ బౌజర్ ప్రతిస్పందించారు. “మేము మీకు ఉండటానికి స్థలాలు ఇస్తాము, కానీ రాజధానికి చాలా దూరంగా” అని ట్రంప్ ఆదివారం తన సోషల్ మీడియా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే మరిన్ని సుంకాలు విధించేందుకు కూడా వెనకాడబోనని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. భారత్ మాత్రం రష్యాతో బంధం కొనసాగుతుందని, టారిఫ్‌ల భారాన్ని మోసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే ట్రంప్ ఎందుకిలా రెచ్చిపోతున్నారు? ఆయన రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు ఏంటి? భారత్-రష్యా సంబంధాలను దెబ్బ కొట్టేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారా..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. భారత్‌పై ట్రంప్ సుంకాలు..!…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సుంకాల లిస్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4:30 గంటలకు, అంటే భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 2 గంటలకు, ఆయన ఓవల్ ఆఫీసులో కీలక ప్రకటన చేయనున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఉత్కంఠ రాజకీయం, వ్యాపార రంగాల్లోనూ తీవ్రంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ట్రంప్ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.…