రోజురోజుకు కరోనా విజృభిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇక ఈ మహమ్మారి వలన చిత్ర పరిశ్రమ కుదేలు అవుతోంది. ఇటీవల థర్డ్ వేవ్ విజృంభిస్తుండడంతో సినిమాలను వాయిదా వేయడం తప్ప మేకర్స్ కి వేరే గత్యంతరం కనిపించడం లేదు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల నుంచి సాధారణ సినిమాల వరకు చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ని మార్చుకున్నాయి. తాజాగా అదే కోవలోకి చేరింది అడవి శేష్ ” మేజర్” శశి కిరణ్…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 3,06,064 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు 27,469 కేసులు తక్కువగా నమోదుకావడం ఊరటనిచ్చేవిషయం. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 439 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, 24 గంటల్లో 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది. కేసులు కొంత మేర…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన సగంతి తెలిసిందే ఈ మహమ్మారి వలన అన్న రమేష్ బాబు మృతదేహాన్ని కడసారి కూడా చూడలేకపోయాడు మహేష్. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న రమేష్ బాబు జనవరి 8 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అన్న మరణం మహేష్ ని తీవ్రంగా కలిచివేసింది. చివరిచూపు కూడా నోచుకోలేకపోవడం మహేష్ ని ఇంకా కృంగదీసింది. కరోనా నుంచి కోలుకున్న మరుక్షణం మహేష్.. అన్న రమేష్ పెద్ద…
కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వేను రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంగతి తెల్సిందే.. సిద్ధిపేట పట్టణంలోని పలువార్డుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలోని అదరిని టీకా తీసుకున్నారా లేదా అని మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. నిన్న ఒక్క రోజే 12 లక్షల మందికి పరీక్షలు చేశారు వైద్యాధికారులు. హోమ్…
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ మహమ్మారి బుసలు కొడుతోంది.. వరుసగా భారీ స్థాయిలో కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత క్రమంగా కోవిడ్ మీటర్ పైకే కదులుతోంది.. ఓవైపు టెస్ట్‌ల సంఖ్య తగ్గినా.. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,516 శాంపిల్స్ పరీక్షించగా 13,212 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఐదుగురు కోవిడ్ బాధితులు…
చిత్ర పరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రోలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. `హలో ఫ్రెండ్స్ కోవిడ్ వచ్చింది. ఇంట్లోవిశ్రాంతి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ మామను అందరూ సీరియస్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్” అంటూ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు.…
చిత్ర పరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. రోజురోజుకు స్టార్లు కరోనా బారిన పడడం ఎక్కువైపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అందరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తోంది. ఇటీవల మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడిన విషయం విదితమే.. ప్రస్తుత్తం ఆయన ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మమ్ముట్టీ కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ కి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపచ దేశాలను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాలపై విరుచుకుపడుతోంది.. మరికొన్ని దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది.. దాని దెబ్బకు థర్డ్ వేవ్.. కొన్ని ప్రాంతాల్తో ఫోర్త్ వేవ్ కూడా వచ్చేసింది.. దీంతో ఆంక్షల బాట పడుతున్నాయి అన్ని దేశాలు.. మరోవైపు.. కరోనా ఫస్ట్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్.. ఒమైక్రాన్ మాత్రం ఇంకా ఎంటర్ కానీలేదు.. అయితే, ఒక వేళ ఒమిక్రాన్ వచ్చినా లాక్‌డౌన్‌కు వెళ్లేది లేదంటున్నారు…
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని…