ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 3,06,064 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు 27,469 కేసులు తక్కువగా నమోదుకావడం ఊరటనిచ్చేవిషయం. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 439 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, 24 గంటల్లో 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది. కేసులు కొంత మేర తగ్గుతున్నా పాజిటివిటీ రేటు భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో పాజిటివిటీ రేటు 5 శాతం మించితే కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. కానీ, థర్డ్ వేవ్ సమయంలో అలాంటివి పెద్దగా కనిపించడంలేదు. కరోనా కేసులు పెరుగుతున్నా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి. వారం రోజులపాటు మందులు వాడుతూ నిబంధనలు పాటిస్తే కరోనా నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read: గుడివాడ క్యాసినో వివాదంపై జగన్ సమాధానం చెప్పాలి : సీపీఐ రామకృష్ణ