చిత్ర పరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రోలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. `హలో ఫ్రెండ్స్ కోవిడ్ వచ్చింది. ఇంట్లోవిశ్రాంతి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ మామను అందరూ సీరియస్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్” అంటూ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు. పెళ్లి చూపులు చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన తరుణ్ , ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా మారిపోయాడు. ఇక ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో తరుణ్ హీరోగా మారాడు. ఈ సివినిమను రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మించాడు. ప్రస్తుతం తరుణ్, విక్టరీ వెంకటేష్ కోసం కథను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.