దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్ వేవ్ మహమ్మారి కేసులు తగ్గుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. కరోనా కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. థర్డ్ వేవ్ మోదలయ్యాక ఢిల్లీలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు గరిష్టంగా 30 శాతానికి నమోదైంది. అయితే, ఇప్పుడు కేసులు ఆదే స్థాయిలో తగ్గిపోయాయి. నిన్న బులిటెన్ ప్రకారం కేసులు 5 వేలకు పడిపోయాయి. పాజీటివిటీ రేటు 11 శాతానికి చేరింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసేందుకు సిద్దమవుతున్నది. త్వరలోనే నైట్ కర్ఫ్యూను, వీకెండ్ కర్ఫ్యూను ఎత్తి వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.