ఆంధ్రప్రదేశ్‌పై కరోనా మహమ్మారి దాడికి దిగుతోంది.. గత రెండు రోజులుగా అమాంతం రోజువారి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. మరోసారి భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. గత 24 గంటల్లో రాష్ట్రలో 47,420 శాంపిల్స్ పరీక్షించగా.. 12,615 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కరి చొప్పున కన్నుమూశారు.. ఇక, గత 24 గంటల్లో 3,674 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలున్నారు. ఇప్పటి వరకు ఏపీలో నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 3,20,12,102కు చేరగా.. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 21,40,056కు, రికవరీ కేసులు 20,71,658కి, కోవిడ్ మృతుల సంఖ్య 14,527కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 2,338, విశాఖలో 2,117, గుంటూరులో 1,066, విజయనగరంలో 1,039, నెల్లూరులో 1,012 నమోదు అయ్యాయి.
Read Also: ఈ నెల 31 వరకు కోవిడ్ ఆంక్షలు.. ఉత్తర్వులు జారీ