టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన సగంతి తెలిసిందే ఈ మహమ్మారి వలన అన్న రమేష్ బాబు మృతదేహాన్ని కడసారి కూడా చూడలేకపోయాడు మహేష్. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న రమేష్ బాబు జనవరి 8 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అన్న మరణం మహేష్ ని తీవ్రంగా కలిచివేసింది. చివరిచూపు కూడా నోచుకోలేకపోవడం మహేష్ ని ఇంకా కృంగదీసింది. కరోనా నుంచి కోలుకున్న మరుక్షణం మహేష్.. అన్న రమేష్ పెద్ద కర్మలో పాల్గొన్నాడు. శనివారం రమేష్ బాబు దశదిన పెద్ద కర్మ కార్యక్రమం ఉండటంతో మహేష్ తన సోదరుడి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.
వదిన, అన్న పిల్లలను ఓదార్చారు. అన్న రమేష్ ని తలుచుకొని కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం ఈ ఘ్తనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రమేష్ ఇంట్లో మహేష్ బాబు ఉన్న ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ ధైర్యంగా ఉండాలని మహేష్ ని ఓదారుస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ సర్కారువారి పాట చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.