దేశంలో కార్బెవాక్స్ హెటిరోలాజస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీజీసీఐ) బూస్టర్ డోస్ అనుమతి ఇచ్చింది. దేశంలో తొలిసారిగా బూస్టర్ డోస్ అనుమతి పొందిన హెటెరోలాజస్ డ్రగ్ గా కార్బెవాక్స్ నిలిచింది. హైదరాబాద్ కు చెందిన డ్రగ్ మేకర్ బయోలాజికల్-ఈ సంస్థ కార్బెవాక్ ను తయారు చేస్తోంది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన అంతకన్నా ఎక్కువ వయసు గల వ్యక్తులు ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు మార్గం సుగమమైంది. రెండు డోసుల కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కార్బెవాక్ ను బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చు.
దీని కన్నా ముందు 5 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు కార్బెవాక్స్ టీకాను అత్యవసర వినియోగానికి ఉపయోంచవచ్చని ప్రభుత్వ ప్యానెల్ అనుమతి ఇచ్చింది. కార్బెవాక్ అత్యవసర వినియోగ దరఖాస్తుపై చర్చించిన సీడీఎస్సీఓ నిపుణుల కమిటీ అత్యవస వినియోగ అధికారాన్ని ఇచ్చింది. కార్బెవాక్ భిన్నమైన టీకా. కోవీషీల్డ్, కోవాగ్జిన్ తీసుకున్న వారు కూడా ఈ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు. హెటిరోలాగస్ బూస్టర్ డోస్ గా కార్బెవాక్ ను అందిస్తున్నట్లుగా కంపెనీ ప్రకటించిది. ఇప్పటికే అనేక క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేస్తుకుని నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాత బూస్టర్ డోస్ గా కార్బెవాక్ కు అనుమతి లభించింది.