కరోనా ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుందని ఆనందించేలోపు కరోనా కేసులు పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది.ఇక ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమ కొద్దికొద్దిగా కోలుకొంటుంది. పార్టీలు, ఈవెంట్స్ అంటూ కళకళలాడుతున్నాయి.అయితే ఒకేసారి 50 మంది స్టార్లు కరోనా బారిన పడడం షాక్ కు గురిచేస్తోంది. అయితే ఇందుకు కారణం ఒక బర్త్ డే అని తెలుస్తోంది. అది ఎవరిదో కాదు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పార్టీ అని సమాచారం. కోవిడ్ వైరస్ ఈ పార్టీలో 50 మంది అతిథులపై ఎటాక్ చేసిందని గుసగుస వినిపిస్తోంది.మే 25 న దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా అంధేరీ వెస్ట్ లోని యష్ రాజ్ స్టూడియోస్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం విదితమే. ఈ థీమ్ పార్టీకి బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే విజయ్ దేవరకొండ – రష్మిక మందన కూడా అటెండయ్యారు.
బాలీవుడ్ లో సీనియర్, జూనియర్ అని లేకుండా అందరు హాజరయ్యి సందండి చేశారు. అయితే ఆ సందండి ఎంతో సమయం నిలవలేదు. మరుసటి రోజునుంచే ఆ పార్టీకి వెళ్లిన వారందరు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారట.. ఇప్పటికే 50మంది స్టార్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు కరణ్ జోహార్ ను ఆడేసుకుంటున్నాడు. పార్టీ ఇచ్చావా.. కరోనా ను ఇచ్చావా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది.. అంతమంది ఒకేసారి కలిస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో కలకలం రేపుతోంది.