Purandeswari: జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయి.. వారి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావలసినవి వస్తున్నాయని, నిధులు ఇస్తే ఇచ్చారని, ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. సీబీఐ అనేది స్వతంత్ర సంస్థ.. దానిపై ఎవరి ప్రభావం ఉండదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, అమిత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, అమిత్ షాను ఎవరైనా కలవచ్చని తెలిపారు. పొత్తులు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు.
Read Also: PAN-Aadhaar Link: పాన్ – ఆధార్ లింక్.. 5 సంవత్సరాలలో 15 సార్లు గడువు పొడిగింపు!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కాగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇవాళ విశాఖ నగరానికి వస్తున్నారు. శ్రీకాళహస్తిలో శనివారం జరిగిన సభకు నడ్డా హాజరు కాగా.. విశాఖ సభకు అమిత్ షా వస్తున్నారు. ఇక్కడి రైల్వే ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఈ సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ప్రధాని హోదాలో మోడీ 2019లో వచ్చినప్పుడు కూడా ఇదే గ్రౌండ్‌లో బీజేపీ సభ నిర్వహించింది. ఇప్పుడు అక్కడే అమిత్ షా విశాఖ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Read Also: Perni Nani: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం..
ఈ సభకు అమిత్ షా తమిళనాడు నుంచి బయలుదేరి సాయంత్రం వస్తారని జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి తెలిపారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మాట్లాడతారు.. ఆ తరువాత పోర్టు అతిథి గృహానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించింది. అనంతరం అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్లిపోతారు. పార్టీ ఆదేశిస్తే విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆమె అన్నారు. అమిత్ షా పొత్తులపై ఎలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని తెలిపారు. పొత్తులపై బీజేపీ అధిష్టానం స్పష్టం చేస్తుందని పురందేశ్వరి పేర్కొన్నారు.
- Tags
- Amit Shah
- bjp
- CBI
- chandrababu
- janasena
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!