IPS officer Ajay Bhatnagar appointed Special Director in CBI: సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ భట్నాగర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో స్పెషల్ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన భట్నాగర్ ప్రస్తుతం ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. నవంబరు 20, 2024న పదవీ విరమణ తేదీ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని కేంద్రం పేర్కొంది.
Also Read: Covid-19: చైనా కావాలనే కొవిడ్‌ను మనుషులకు ఎక్కించింది: వుహాన్ పరిశోధకుడు
సీబీఐలో జాయింట్ డైరెక్టర్ అనురాగ్ ఇప్పుడు సీబీఐలో అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన జులై 24, 2023 వరకు అంటే 7 సంవత్సరాల పదవీకాలం పూర్తయ్యే వరకు నియమితులైనట్లు ఉత్తర్వు పేర్కొంది. 1994 బ్యాచ్ గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ సీబీఐలో మూడేళ్లపాటు అదనపు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన దర్యాప్తు సంస్థలో జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.