BSNL: బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులపై 25 చోట్ల సిబిఐ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ను మోసం చేసి ఒక ప్రైవేటు కాంట్రాక్టర్‌కు మేలు చేయాలని చూసిన బీఎస్ఎన్‌ఎల్ అధికారులపై సీబీఐ దాడులు నిర్వహించింది. మాజీ జనరల్ మేనేజర్‌తో సహా 21 మంది అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో సీబీఐ దేశ వ్యాప్తంగా 25 చోట్ల సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)ని మోసం చేసేందుకు నిందితులు ఒక కాంట్రాక్టర్‌తో కలిసి కుట్ర పన్నారని ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆరోపించింది.
Read also: Draupadi Murmu: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్.. హాజరైన రాష్ట్రపతి
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
జోర్హాట్, సిబ్‌సాగర్, గౌహతి మరియు ఇతర ప్రాంతాలలో మాజీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌తో సహా బిఎస్‌ఎన్‌ఎల్ అస్సాం సర్కిల్ అధికారులపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఓ ప్రైవేట్ వ్యక్తి పేరు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్(ఓఎఫ్‌సీ) కేబుల్‌ను ఓపెన్ ట్రెంచింగ్ పద్ధతిలో కిలోమీటరుకు రూ. 90,000 చొప్పున వేయడానికి కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇచ్చారని సీబీఐ ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read also: Gold Bond: రూ. 5,926కి గోల్డ్ బాండ్ ఇస్తున్న ప్రభుత్వం.. సోమవారం నుంచి షురూ
కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ప్రైవేట్ భూమి యజమాని నుండి ఎటువంటి హక్కు లేకుండా వివిధ అభ్యర్ధనలు చేశాడు, ఓపెన్ ట్రెంచింగ్ పద్ధతిని క్షితిజ సమాంతర దిశాత్మక డ్రిల్లింగ్ పద్ధతికి మార్చడానికి ప్రతిపాదించాడు. అందుకు కిమీకి రూ. 2.30 లక్షలు ఇచ్చినప్పటికీ…నియమాలను పాటించకుండా.. టెండర్ నిబంధనను ఉల్లంఘించడంతో BSNLకి రూ. 22 కోట్ల (సుమారు) నష్టం వాటిల్లిందని అధికారి తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు హర్యానాలోని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల కార్యాలయాలతోపాటు నివాసాలతో సహా 25 ప్రదేశాలలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!