Minister KTR: ఎన్నికల్లో రూ.100 కోట్ల ఖర్చు.. బీజేపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బహిరంగంగా తెలంగాణ బీజేపీ ఎమ్మల్యే చెబుతుంటే ఐటీ, ఈడీలు ఎక్కడున్నాయని ఆయన క్యశ్చన్ చేశాడు. ఈ ఇష్యులో బీజేపీకి నోటీసులు జారీ ఇస్తారా? విచారణ జరిపిస్తారా? అని కేటీఆర్ అడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నాడు.
Read Also: Yash: రీల్ అయినా.. రియల్ అయినా.. రాఖీ భాయ్ రేంజే వేరురా
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
ప్రధాని మోడీ ప్రసంగం అబద్ధాల మూట అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశాడు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పకుండా ప్రధాని ప్రసంగం కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంపైనే దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలకు తెలంగాణ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే రిపేర్ షాపు ఏర్పాటు చేయడం నిజంగా తెలంగాణ ప్రజలను కేంద్ర ప్రభుత్వం అవమానించడమేనన్నారు.
Read Also: Cyber Crime: సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.46 లక్షలు స్వాహా
మోడీ ప్రభుత్వం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ను పట్టించుకోకుండా గుజరాత్ కు రూ.20 వేల కోట్ల విలువైన లోకోమోటివ్ ఫ్యాక్టరీని మంజూరు చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పెండింగ్ హామీలను నెరవేర్చడంలో, డిమాండ్లను పరిష్కరించడంలో ప్రధాని నిర్లక్ష్యాన్ని, వివక్షను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి తన తెలిపారు. సరైన సమయంలో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: Hair Oil: మీ నల్లని జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండిలా..!
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రధాని చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం లక్షా 1 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఖాళీలను భర్తీ చేయడంలో విఫలమైందన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలను ప్రైవేటీకరించడం విడ్డూరంగా ఉంది.. ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన ప్రధాని మోడీ ద్రోహాన్ని తెలంగాణ యువత ఎప్పటికీ క్షమించదని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులపై మోడీ స్పందించి ఉంటే బాగుండేది.. రాష్ట్ర ప్రభుత్వాని విమర్శించే ముందు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రధానినీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
Where is ECI, ED and IT when a Telangana BJP MLA is openly claiming that his party spent 100 Crore Rupees in a By-election?
Will any notices be issued or enquiry conducted on BJP ?
Irony just died a million deaths after listening to Modi Ji speaking about corruption https://t.co/DLh2apkzZz
— KTR (@KTRBRS) July 9, 2023
- Tags
- bjp
- BRS
- CBI
- hyderabad
- Minister KTR
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!