ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఖాతాలో మరో పెద్ద సంస్థ చేరింది. ప్రాసెస్ మైనింగ్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థగా ఉన్న మినిట్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిన విషయం మాత్రం మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. కాగా మినిట్ సంస్థ బిజినెస్ వ్యవహారాల్లో ఆపరేషన్స్ నిర్వహణలో మెరుగైన కార్యాచరణ సామర్థ్యం కోసం అవకాశాలను వెలికితీయడంలో ప్రసిద్ధి చెందింది.
వ్యాపార ప్రక్రియ పూర్తి చిత్రాన్ని రూపొందించడం ద్వారా డిజిటల్‌గా రూపాంతరం చెందడానికి, కార్యాచరణ నైపుణ్యాన్ని పెంచుకోవడంలో మినిట్ తమకు సహకారం అందిస్తుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. వ్యాపారంలోని ప్రతి ప్రక్రియను సులభంగా, స్వయంచాలకంగా విశ్లేషించి మెరుగుపరచడానికి మినిట్ తమకు వీలు కల్పిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. తద్వారా తమ కస్టమర్లు ప్రాసెస్ డేటాను మెరుగ్గా అర్థం చేసుకుంటారని, తమ కార్యకలాపాలను తెలుసుకుంటారని అభిప్రాయపడింది.
కాగా మైక్రోసాఫ్ట్ ఇటీవలే RPA సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన సాఫ్ట్‌మోటివ్‌ను కొనుగోలు చేసింది. తాజాగా మినిట్‌ను కొనుగోలు చేయడంతో పొలారిస్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం 2030 నాటికి సాఫ్ట్‌వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ 11 బిలియన్ డాలర్లకు చేరుకుని అగ్రగామిగా నిలుస్తుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు దేశంలోని స్టార్టప్‌ల కోసం ఫౌండర్స్హబ్ను మైక్రోసాఫ్ట్గురువారం లాంచ్ చేసింది. స్టార్టప్జర్నీలో ఫౌండర్లకు ప్రతి స్టేజ్‌లోనూ ఈ ప్లాట్‌ఫామ్ అండగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్తెలిపింది. తమతో పాటు తమ భాగస్వాముల నుంచి 3 లక్షల డాలర్ల విలువైన బెనిఫిట్లు, క్రెడిట్లు, ఫ్రీ టెక్నాలజీ, టూల్స్, రిసోర్సెస్ వంటివి ఈ ప్లాట్‌ఫామ్‌ద్వారా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.