KIA Cars : జోరుమీదున్న కియా.. 20 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ భారత విపణిలోకి ప్రవేశించాయి. టూ వీలర్స్ మాత్రమే కాకుండా ఎలక్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దేశీయంగా మోటార్స్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే.. కొత్త కొత్త మోడల్స్‌తో ఆకర్షిస్తోన్న కియా మోటర్స్ కూడా ఈవీ కార్లను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పటికే కియా మోటర్స్ ఈవీ6 విద్యుత్ కారును ప్రపంచ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఈవీ6 విద్యుత్ కారును భారత విపణిలో అవిష్కరించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఎస్‌యూవీ మోడల్‌కు చెందిన ఈ కియా ఈవీ6 కారు పొడవు దాదాపు 4.7 మీటర్లగా తెలుస్తోంది. ఈ కారును ఐదు మోడళ్లలో ఆవిష్కరించే అవకాశం ఉంది.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
3 రకాల బ్యాటరీ ప్యాక్‌లతో 20 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్ అయ్యే సదుపాయం కూడా ఈ కారుకు ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కారును తొలి దశలో పూర్తిగా కొరియా నుంచి దిగుమతి చేసుకుని, మనదేశంలో విక్రయిస్తారని, తదుపరి మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. దేశీయంగా ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విద్యుత్తు వాహనం ధర రూ.50-60 లక్షలు ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!