దేశవ్యాప్తంగా చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడంతో పెట్రోల్ బంకు వైపు వెళ్లాలంటే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. బుధవారం (నవంబర్ 3) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర 37 పైసలు పెరిగి రూ.114.49గా ఉంది. లీటరు డీజిల్ ధర 40 పైసలు పెరిగి రూ.107.40కి చేరింది. మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.116.61గా, లీటరు డీజిల్ ధర రూ.108.89గా…
దేశంలో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నూనెతో వంట చేసుకోవాలంటే అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల సంఘం సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దీపావళి పండగ నేపథ్యంలో హోల్‌సేల్‌గా విక్రయించే లీటరు నూనెను రూ.3 నుంచి రూ.5 వరకు తగ్గించే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించింది. నూనెల పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నా పండగ దృష్ట్యా వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. Read…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన 66వ పుట్టినరోజును టర్కీ తీరంలోని సూపర్ యాచ్‌లో జరుపుకున్నారు. బిల్‌గేట్స్ తన పుట్టినరోజు పార్టీకి పిలిచిన 50 మంది అతిథుల్లో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ముఖ్యంగా బిల్‌గేట్స్ ఆహ్వానించిన ఈ పార్టీకి వెళ్లేందుకు బెజోస్ ప్రైవేట్ హెలికాప్టర్ వినియోగించారని డైలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది. అందుకోసం బెజోస్ 120 మైళ్ల దూరం ప్రయాణించారని అందులో పేర్కొంది. అయితే బెజోస్ ప్రయాణించిన…
దేశంలో కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ నెలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను చూస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. అక్టోబరులో దేశవ్యాప్తంగా రూ.1,30,127 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఈ వసూళ్లలో సీజీఎస్టీ వసూళ్లు 23,861 కోట్లు కాగా ఎస్జీఎస్టీ వసూళ్లు 30,421 కోట్లు. ఐజీఎస్టీ కింద రూ.67,361 కోట్లు వచ్చాయి.…
నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు నిబంధనలు, రైల్వేలు, గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు వంటివి ఇందులో ఉన్నాయి. ఆయిల్ సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నాడు సవరించనున్నాయి. ఇప్పటికే పలుమార్లు పెరిగిన గ్యాస్ ధర.. రేపు మరోసారి పెరిగే అవకాశం ఉంది. అటు, పెన్షనర్లు లైవ్ సర్టిఫికేట్ సమర్పణకు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కల్పించిన వీడియో కాల్ సదుపాయం రేపటి…
యూపీఐ లావాదేవీలు జరిపేవారికి గూగుల్ పే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ ప్రారంభంలో (అప్పట్లో ‘తేజ్’ యాప్) స్క్రాచ్ కార్డు ఆఫర్ ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా గూగుల్ పే దారినే నమ్ముకుంది. వాట్సాప్ కూడా పేమెంట్స్ కేటగిరిలోకి అడుగుపెట్టడంతో యూజర్లను అట్రాక్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. దీంతో ఆఫర్లు ప్రకటించాలని నిర్ణయించుకుంది. యూజర్లు వాట్సాప్ పేమెంట్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే…
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ఇప్పట్లో బ్రేక్ పడే దాఖలాలు కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎలా ఉన్నా… దేశీయ మార్కెట్లో మాత్రం పరుగులు పెడుతున్నాయి. రోజూవారీ ధరల పెంపు కారణంగా పెట్రోల్ ధరలు అడ్డూ, అదుపు లేకుండా పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. శనివారం పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.36కి చేరింది. అటు…
హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాయి. ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం, వైద్యం కోసం, తమ బంధువుల కోసం, సొంత పర్యటనల చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో మన కరెన్సీ చెల్లదు కాబట్టి మన డబ్బును ఇచ్చి ఆయా దేశాల కరెన్సీని తీసుకుంటారు. ఇలా డబ్బును బదిలీ చేసే వారిపై ప్రాసెసింగ్ ఫీజు, మార్కప్ ఫీజుల పేరుతో బ్యాంకులు హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ క్యాపిటల్ ఎకానమిక్స్ అనే…
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగలనుంది. రికార్డు స్థాయికి చేరిన వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు మరోసారి పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 వరకు పెరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి…
సెల్‌ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. రిలయన్స్ జియో-గూగుల్ కలిసి రూపొందిస్తున్న జియో ఫోన్ ‘నెక్స్ట్’ లాంచింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ ఫోన్‌ను దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో కొత్తగా స్మార్ట్ఫోన్లకు అలవాటు పడిన వారి సంఖ్య బాగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే వారికి కూడా అందుబాటు ధరలో ఫోన్‌ను తీసుకురావడం ఆనందంగా…