ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అనుకున్నది సాధించాడు. ఇటీవల ట్విట్టర్‌లో వాటాదారుడైన ఎలాన్.. ట్విట్టర్‌లోని ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఖంగుతిన్న ట్విట్టర్ యాజమాన్యం గందరగోళంలో పడింది. అంతేకాకుండా ఎలాన్ మస్క్ వాటాదారులతో విరివిగా సమావేశాలు నిర్వహించి.. ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతుండడంతో దిగొచ్చిన ట్విట్టర్ యాజమాన్యం.. ఎలాన్‌తో సమావేశమైంది.
అయితే ఈ సమావేశం అనంతరం.. మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికే చిక్కినట్టే కనిపిస్తుంది. సంస్థను 43 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసేందుకు మస్క్ ఇచ్చిన ఆఫర్‌కు ట్విట్టర్ బోర్డ్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే మొత్తం ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ సొంతం చేసుకోనున్నారు. అయితే ఎలాన్ మస్క్ ఫుల్ ప్లాన్డ్‌గా ట్విట్టర్‌ను చేజిక్కుచ్చుకుంటున్నారని బిజినెస్ ఆనాలసిస్ట్‌లు అంటున్నారు.