ఉగాది పర్వదినం రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు శాంతించలేదు. పండగ వేళ అని కూడా చూడకుండా వాహనదారులకు చమురు కంపెనీలు వాహనదారులకు షాకిచ్చాయి. పెట్రోల్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ 80 పైసల చొప్పున పెరిగాయి. గత 12 రోజుల్లో పెట్రోల్ రేట్లను పెంచడం ఇది పదో సారి. 12 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.20 చొప్పున పెరిగాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.33గా, లీటర్ డీజిల్ ధర రూ.102.45గా నమోదైంది. అటు ఏపీలోని విజయవాడలో పెట్రోల్ రూ.118.74, డీజిల్ రూ.104.45గా ఉంది. గుంటూరులో పెట్రోల్ రూ.119.01, డీజిల్ రూ.104.70గా పలుకుతోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.61 సెంచరీ దాటేయగా.. డీజిల్ ధర మాత్రం 93.87కు పెరిగింది.
https://ntvtelugu.com/new-rules-implementing-from-april-1st/