నిబంధనలు ఉల్లంఘించిన మూడు సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. ఆర్‌బీఐ దృష్టికి రాకుండా కొన్ని బ్యాంకులు లోన్‌లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలు దాచే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆర్‌బీఐ నిఘా పెట్టడంతో అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కోకన్ మెర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సమతా కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5 లక్షల జరిమానా విధించింది.
ఆదాయం, ఆస్తుల వర్గీకరణ తదితర అంశాల్లో మార్గదర్శకాలు పాటించకపోవడంపై ఫాల్టన్‌కు చెందిన యశ్వంత్ కో ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.2లక్షల జరిమానా విధించింది. మరోవైపు ముంబైకి చెందిన కోకాన్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌కు రూ.2లక్షల జరిమానా విధించింది. అలాగే కోల్‌కతాకు చెందిన సమతా కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.లక్ష జరిమానా విధించగా.. రెగ్యులెటరీ కంప్లైయన్స్‌లో లోపాలపై జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కాగా సదరు బ్యాంకులపై తాము తీసుకున్న చర్యలు ఆ బ్యాంకుల కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
https://ntvtelugu.com/elon-musk-purchases-9-2-percent-stakes-in-twitter/