ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ఒప్పొ ముందుంటుంది. ఇప్పటికే ఒప్పొ నుంచి వచ్చిన మొబైల్స్, ట్యాబ్లెట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒప్పొ ప్యాడ్ అంటూ ఓ మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా ఒప్పొ ప్యాడ్ ఎయిర్ పేరుతో మరొ కొత్త ట్యాబ్లెట్‌ను చైనా విపణిలోకి విడుదల చేసింది. అయితే.. త్వరలోనే ఈ ట్యాబ్ అమ్మకాలు భారత్‌లో కూడా ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ ట్యాబ్ చూడటానికి చాలా ఖరీదుగా కనిపించిన ధర రూ. 15000 నుంచి ప్రారంభం కానుంది. కానీ.. దీనిలో వీడియో, ఫోటో ఎడిటింగ్ కొంచెం కష్టమనే చెప్పాలని.. అవి మినహాయిస్తే.. మిగితా అన్ని ఫీచర్స్‌లో ఈ ట్యాబ్లెట్ అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు.
ఒప్పో ప్యాడ్ కు లైటర్ వెర్షన్‌గా విడుదల చేసిన ఈ ట్యాబ్ బరువు కేవలం 440 గ్రాములే. అతి తక్కువ బరువుతో కూడిన ట్యాబ్ లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. అంతేకాదు 6.94ఎంఎంతో అతి పలుచుగా ఈ ట్యాబ్ ఉంటుంది. ఇందులో ఇది మోసర్తు వేగంతో కూడిన, నమ్మకమైన స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 10.36 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ (2కే డిస్ ప్లే), 60హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. బ్రైట్ నెస్ 360 నిట్స్ గా ఉంది. 7,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా కలర్ ఓఎస్ తో పనిచేస్తుంది. నాలుగు స్పీకర్లతో డాల్బీ ఆటమ్స్ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాతో మనముందుకు రానుంది.