ట్యాక్స్ రెవెన్యూ 40 వేళా కోట్లు చూపెట్టారని, దీనిపై ట్యాక్స్ వేశారా... వేయాలని ఆలోచిస్తున్నారా..?అంటూ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దేశ సంపద దోపిడీకి గురి అవతోందని ఆగ్రహంమం వ్యక్తం చేశారు. 41 వేల కోట్లు గ్రాంట్స్ అంచనా వేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 8 వేల కోట్లు దాటలేదన్నారు.
ఎమ్మెల్యే ఎర కేసులో సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 17న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈరోజు సీజేఐ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో మెరిట్‌లు ఉంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తిప్పికొడతామని…
Off The Record: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా రాజకీయాలు వాడీవేడిగా మారుతున్నాయి. ఇది గిరిజనులకు రిజర్వ్ చేసినా నియోజకవర్గమైనప్పటికీ సాధారణ సెగ్మెంట్‌కు మించిన పొలిటికల్ ఎత్తులు నడుస్తున్నాయి. వైరాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరులు ఎక్కువే. గత కొన్నిఎన్నికల్లో ఆయన చెప్పినవారే ఎమ్మెల్యేలుగా గెలుస్తుండటంతో.. ఆ విజయాన్ని పొంగులేటి ఖాతాలో వేసేవారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం అధికారపార్టీలో రెబల్‌గా మారిపోయారు పొంగులేటి. ఆయన అనుచరులు సైతం ఒక్కొక్కరుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో వైరాలోని…
Off The Record: నోముల భగత్.. ఎంసీ కోటిరెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఇద్దరూ కలిసి ఉన్నట్టు కనిపించినా.. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. సీనియర్ రాజకీయ వేత్త నోముల నర్సింహయ్య 2018లో నాగార్జున సాగర్ నుంచి అధికారపార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హఠాన్మరణంతో వచ్చిన ఉపఎన్నికల్లో నర్సింహయ్య కుమారుడు భగత్ ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్తవానికి ఉపఎన్నికలోనే ఎంసీ కోటిరెడ్డి టికెట్ ఆశించారు. కానీ.. పార్టీ పెద్దల…