పార్టీ మారినట్లుగా వస్తున్న వార్తలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు లిఖితపూర్వంగా వివరణ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణకు హాజరవని మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతేంటి? లిస్ట్‌లో మొత్తం పది మంది ఉంటే… 8మందిని విచారించి ఐదుగురి విషయంలోనే తీర్పు ఇవ్వడం వెనక ఉద్దేశ్యం ఏంటి? ఆ ముగ్గురి విషయంలో తీర్పు ఎప్పుడు? ప్రస్తుతం బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వరుసగా జడ్జిమెంట్ ఇస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది విచారణ ముగియగా… ఐదుగురి విషయంలో…
బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం బీఆర్ఎస్కు అలవాటైపోయిందన్నారు.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు.
Sarpanch Election: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మామపై కోడలు పోటీ చేసి విజయం సాధించింది.
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఆదివారం నాడు జరిగిన మలి విడత ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
BRS : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న పార్టీకి చెందిన కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకంగా కృష్ణా-గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈ సమావేశంలో విస్తృతంగా…
మాటకు మాట కాదు…. ఒకటికి రెండు మాటలతో సమాధానం చెప్పబోతున్నారా? ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇప్పటికే హద్దులన్నీ చెరిగిపోగా… ఇక నుంచి డోస్ డబుల్ చేయాలని బీఆర్ఎస్ డిసైడైందా? కవిత మీద ఇన్నాళ్ళు చేసిన విమర్శలు ఒక లెక్క, ఇక నుంచి చేయబోయేవి మరో లెక్కగా మారబోతోందా? ఈ మాటల యుద్ధంలో టాప్ సీక్రెట్స్ కూడా బయటపడబోతున్నాయా? లెట్స్ వాచ్. నువ్వు తమలపాకుతో ఒకటంటే… నేను తలుపు చెక్కతో నాలుగంటాను అన్నట్టుగా మారిపోయింది ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్…
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి తమ హవాను చాటారు. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా, వెలువడుతున్న తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 850 సర్పంచ్ పదవులను కైవసం చేసుకుని, 80% స్థానాల్లో విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 350 స్థానాలు, బీజేపీ 60…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వారు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బుధవారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్, అక్కడ నిర్వహించిన ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… దేవుళ్ల మీద ఒట్టేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల…