Jagga Reddy : మంత్రి హరీష్‌రావును కలిసిన జగ్గారెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీష్ రావుని కలిసి రిప్రెసెంటేషన్స్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావుని తన ఛాంబర్‌లో కలిసిన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వాలని కోరారు. ఎన్ ఆర్ ఈ జీ ఎస్ స్కీమ్ కింద 5 కోట్ల 50 లక్షల ఫండ్స్ ఇవ్వాలని కోరడం జరిగిందని, సంగారెడ్డి పట్టణంలోని ఫాతే ఖాన్ దర్గా అభివృద్ధి కోసం 3 కోట్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా.. ‘సంగారెడ్డి పట్టణంలోని ఈద్ గా అభివృద్ధి కోసం ప్రభుత్వం 5 కోట్లు ఇవ్వాలని కోరుతున్నానని, సంగారెడ్డి పట్టణంలోని దీన్ దార్ ఖాన్ ఫంక్షన్ హాల్ అభివృద్ధి కోసం 5 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించాలని కోరుతున్నానని అన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డి పట్టణంలోనే ముస్లిం ల ఖాభారస్థాన్ (స్మశానవటిక ) కొరకు 5 ఎకరాల భూమి కావాలి.. ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా భూమి కేటాయించాలి. అలాగే సంగారెడ్డి పట్టణంలో హిందువుల స్మశానవటిక కోసం 5 ఎకరాల భూమి కావలెను.. ఇది కూడా సర్కార్ వెంటనే పరిశీలించి మంజురు చేయాలనీ కోరుతున్న.. ఇక క్రిస్టియన్స్ కోసం కూడా సంగారెడ్డి పట్టణంలో 5 ఎకరాల భూమి క్రిస్టియన్స్ గ్రేవ్ యార్డ్ (స్మశానవటిక ) కేటాయించాలని ప్రభుత్వని కోరుతున్న.. సదశివాపేట్ లో మెహబూబ్ పాషా దర్గా అభివృద్ధి కోసం 3కోట్లు మంజూరు చేయాలనీ ప్రభుత్వాని కోరుతున్న.
Also Read : Zomato: 225 సిటీల్లో నిలిచిపోనున్న జొమాటో సేవలు..కారణం ఇదే..
Also Read
అలాగే సదశివాపేట్ లో ముస్లిం ఈద్ గా అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించాలని కోరుతున్న.. సంగారెడ్డి పట్టణంలో ఉన్న సిఎస్ఐ చర్చి ఉంది ఇది ఎంతో చరిత్ర కలిగిన చర్చి ఈ చర్చ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 15కోట్లు కేటాయించాలని కోరుతున్న.. సంగారెడ్డి పట్టణం లో శివాలయం నిర్మించడం జరుగుతుంది అతి పెద్ద శివలింగం కైలాస ప్రస్తారా శ్రీ చక్ర లో శివలింగం ఏర్పాటు చేయబోతున్నారు దీనికోసం ప్రభుత్వం 18 కోట్లు కేటాయించాలని కోరుతున్న. అలాగే సంగారెడ్డి పట్టణం లో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం 18 కోట్లు కేటాయించాలని కోరుతున్న. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వాటర్ లో ఆర్యవైశ్య జిల్లా సంఘం భవనం కోసం 2 ఎకరాల భూమి, 3 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరడం జరిగింది.’ అని జగ్గారెడ్డి వివరించారు. జగ్గారెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యాక్షుడు తోపాజి అనంత కిషన్ గుప్తా, జిల్లా యువజన సంఘాం అధ్యక్షుడు తోపాజి హరీష్ గుప్తా కలిసి ఆర్యవైశ్య భవనం కోసం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
Also Read : Vastushastra : ఏ పని చేసినా కలిసి రావట్లేదా.. అయితే ఇంట్లో ఈ మొక్కలు నాటండి
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!