BRS MLA Aroori Ramesh: సైకో లెక్క బండి సంజయ్.. పిచ్చోడి లెక్క రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aroori Ramesh: అసెంబ్లీ మీడియా పాయింట్ లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, సుంకే రవిశంకర్, దుర్గయ్య చిన్నయ్య బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ పై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఎమ్మల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణకు తలమానికంగా దేశములో ఎక్కడా లేనివిధంగా బ్రహ్మాండమైన సచివాలయం నిర్మించి డా.బీఆర్ అంబెడ్కర్ పేరు పెట్టామన్నారు. దాని కూలగొడత అన్న బండి సంజయ్ ఖబడ్దార్ నోరు అదుపులో పెట్టుకో అంటూ హెచ్చారించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబెడ్కర్ అంటే ఏ మాత్రం గౌరవము లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పిచ్చోడి లెక్క, సైకో లెక్క మాట్లాడుతున్న బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ప్రగతి భవన్ పగులగొడుత అని ఇంకో పిచ్చోడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం టీవీల్లో కవరేజ్ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం కోసం తెలంగాణ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారు కాబట్టే మా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నారని అన్నారు.
Read also: Kishan reddy: బంగారు తెలంగాణ అన్నారు.. కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆర్టికల్ 3 ప్రకారం తెచ్చుకున్న తెలంగాణలో నూతన సెక్రెటరియట్ కి డా.బీఆర్ అంబెడ్కర్ పెరు పెట్టుకుంటే బండి సంజయ్ కి కళ్ళు మండుతున్నాయన్నారు. దళిత వ్యతిరేకి బండి సంజయ్ అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి ముక్కు నేలకు రాయాలి లేదంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ కి డా.బీఆర్ అంబెడ్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ సూచిస్తే దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. సెక్రెటరియట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఆస్తి. దీన్ని కులగొడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరంటూ మండిపడ్డారు. మాయమాటలు చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి బండి సంజయ్,రేవంత్ రెడ్డి పబ్బం గడుపు కోవాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇక్కడ అడ్రెస్ లేదు ఫ్రస్టేషన్ లో ఎం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఇద్దరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు ఇద్దరిని ఎర్రగడ్డలో జాయిన్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు ప్రజలకు బేషరత్ గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Banda Prakash: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక.. బండా ప్రకాష్ నామినేషన్
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?